పాతబస్తీలో భారీగా కేంద్ర బలగాలు

28 Nov, 2020 19:59 IST|Sakshi
ప్లాగ్‌మార్చ్‌లో భాగంగా బుధవారం చార్మినార్‌ వద్ద గుర్రాలపై వెళ్తున్న హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, ఇతర అధికారులు

సాక్షి, హైదరాబాద్‌ :  జీహెచ్‌ఎంసీఎన్నికల ప్రచారం కోసం  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు  ఆయన  బేగంపేట ఎయిర్‌పోర్టు కు చేరుకుంటారు. అక్కడ నుంచి నేనుగా చార్మినార్‌ వద్దకు వెళ్లి అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్‌ మండి హనుమాన్‌ టెంపుల్‌ వరకు అమిత్ షా రోడ్‌ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ ఆఫీసులో ఉండి సాయంత్రం 5 గంటలకు తిరగి ఢిల్లీకి వెళ్తారు. 

ఇదిలాఉంటే హోంమంత్రి అమిత్ షా చార్మినార్ పర్యటన నేపథ్యంలో పాతబస్తీకి భారీగా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. అటు బీజేపీ, ఎంఐఎం పార్టీ ల మధ్య మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చెలరేగిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచే పాతబస్తీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను కూడా రంగంలోకి దింపారు.

మరిన్ని వార్తలు