రూ.10 వేలను అడ్డుకొని రూ.25 వేలు ఎలా ఇస్తారు?

21 Nov, 2020 18:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఆరేళ్లలో హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. శనివారం ఆయన అల్లాపూర్‌ చౌరస్తా నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గ్రేటర్‌ ప్రజల్లో చిచ్చుపెట్టి లబ్ధిపొందేందుకు బీజేపీ యత్నిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా కావాలని సూచించారు. వరద సాయాన్ని బీజేపీ నేతలే అడ్డుకున్నారని ఆరోపించారు.
(చదవండి : టీఆర్‌ఎస్‌ భయపడుతుంది: బండి సంజయ్‌)

రూ.10 వేల సాయాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలు.. గెలిస్తే రూ.25 వేలు ఇస్తామంటే ఎలా నమ్ముతామని నిలదీశాడు. బీజేపీ డ్రామాలు హైదరాబాద్‌లో సాగవన్నారు. ఆరేళ్లలో హైదరాబాద్‌లో 100 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంది కాబట్టే.. అమెజాన్‌, గూగుల్‌ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు నగరాని వచ్చాయన్నారు. భాగ్యనగరం పచ్చగా ఉంటే బీజేపీ నేతల కళ్లు మండుతున్నారని విమర్శించారు. అభివృద్ధి కావాలో..అరాచకం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బల్దియాపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు