వాళ్లు బీజేపీకే ఓటు వేయండి: కేటీఆర్‌

29 Nov, 2020 17:06 IST|Sakshi

వరద సాయాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు

మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టాలని చూస్తున్నారు

మీ ఓటుతో వారికి బుద్ది చెప్పండి

సనత్‌నగర్‌ రోడ్‌షోలో  మంత్రి కేటీఆర్

సాక్షి, హైదరాబాద్‌ : ‘బీజేపీ అధికారంలోకి వస్తే జనధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఎవరి అకౌంట్‌లోనైనా రూ.15 లక్షలు పడ్డాయా?. ఒకవేళ రూ. 15 లక్షలు వచ్చిన వాళ్లు ఉంటే బీజేపీకే ఓటేయ్యండి’ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన సనత్‌నగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతు.. ఆరేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు చేసిందేమిటో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వరద సాయాన్ని బీజేపీయే అడ్డుకుందని మరోసారి పునరుద్ఘాటించారు.హైదరాబాద్‌ను ఐటీ హబ్‌ చేస్తామని అమిత్ షా చెబితే..నమ్మేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. విషయం లేనిది విషం చిమ్మితే నమ్మరని బీజేపీ నేతలకు చురకలు అంటించారు.

కేంద్రం తెలంగాణకు ఇచ్చిన దాని కంటే.. మనమే ఎక్కువ ఇచ్చాం’ అని కేటీఆర్ తెలిపారు.కరోనా టైంలో రూ.20 లక్షల కోట్లు ప్రకటించామన్నారు.. కానీ ఎవరికీ రాలేదని విమర్శించారు. అన్నదమ్ముల్లా కలిసున్న హైదరాబాద్‌ వాసుల్లో చిచ్చుపెట్టాలని బీజేపీ నేతలు  చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారంలోకి వస్తే మోదీ 12 కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు..ఏమైందని ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలేమో కానీ ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని ఎద్దేవా చేశారు. సర్జికల్ స్ట్రేక్ అంటూ బీజేపీ పిచ్చొళ్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. వారిని ఓటుతో తరిమి కొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు