వాళ్లంతా కలియుగ కమెడియన్స్‌

19 Nov, 2020 18:13 IST|Sakshi
ధర్మపురి అరవింద్‌

వరద సాయం ఆపమని మేమెందుకు చెబుతాం

మాకు మజ్లిస్‌తోనే పోటీ

బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చేస్తాం

ఈసీ టీఆర్‌ఎస్‌ చేతుల్లో సంస్థగా మారింది

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నేతలకు అహంకారం తలకెక్కిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇచ్చే సొమ్మును తామెందుకు ఇవ్వొద్దని చెబుతామంటూ విరుచుకుపడ్డారు. వరద బాధితులకు సాయం అందజేయాల్సి ఉందని తెలిసి కూడా ఎందుకు ఎన్నికల కోడ్ తెచ్చుకున్నారు అని ప్రశ్నించారు. ఓడిపోతామని తెలిసే ఎన్నికలను ముందుకు తెచ్చుకున్నారంటూ మండిపడ్డారు. అసలు తమకు టీఆర్‌ఎస్‌తో పోటీ లేదని, కేవలం మజ్లిస్ తోనే.. తలపడతామని, ఓల్డ్ సిటీ వర్సెస్ రెస్టాఫ్ సిటీ.. 45 వర్సెస్ 105 సీట్లు అని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి.

ఈ క్రమంలో నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆదాబ్ అనాలే. ఇకపై బ్రాండ్ హైదరాబాద్ కాదు ఆదాబ్ హైదరాబాద్ చేస్తడు కేసీఆర్. ప్రజల మధ్యకు పోతే కేటీఆర్‌ను కొట్టేటట్టు ఉన్నారు. బీజేపీకి ఓటేస్తే గుజరాత్‌లాగా అభివృద్ధి చెందుతది మంచిదే కదా. రాష్ట్రపతి పాలనలో ఐటీ హైదరాబాద్ వచ్చింది. హైటెక్ సిటీని కంజెస్ట్ చేసి ఆ ప్రాంతాన్ని గబ్బుపట్టించారు. కొంగర కళాన్ సభలో ఇంటింటికి నల్లా నీరు ఇస్తామన్నారు.. 95శాతం పూర్తి అయ్యింది అన్నారు. ఏమైంది’’అని ప్రశ్నించారు.(చదవండి: ‘గెలిస్తే.. వారికి ఇంటికి రూ. 25వేలు ఇస్తాం’)

అదే విధంగా.. ‘‘బాయికాడ మీటర్లు పెట్టాలని ఎక్కడా లేదు. డిస్కంలకు కోట్ల రూపాయల బకాయిలు పడ్డారు.. ఆ లెక్క చెప్పండి. దేశంలో అనేక ప్రాంతాలను విద్యుదీకరణ చేసింది మోదీ ప్రభుత్వమే. 97వేల కోట్ల రూపాయల అప్పులను డిస్కంలకు మిగిల్చారు కేసీఆర్. ఒక మతానికి అమ్మడు పోయిన వ్యక్తి కేటీఆర్కరోనా కు ఒక్క ముస్లిం మహిళకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయించారా? జవహర్ నగర్ కంపూ జూబ్లీహిల్స్ వరకు వస్తుంది. హైదరాబాద్‌లో 10వేల ఇల్లు కూడా కట్టలేదు. కట్టిన ఇల్లు ఎందుకు ఇస్తలేరు. నిజామాబాద్‌లో 200 ఇల్లు కూడా కట్టలేదు. కేసీఆర్ కుటుంబం ప్రెస్‌మీట్‌లు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా మారాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు కలియుగ కమెడియన్స్’’ అంటూ ఎంపీ అరవింద్‌ ఎద్దేవా చేశారు. (చదవండి: గ్రేటర్‌లో బీజేపీ-జనసేన పొత్తు..!)

బదిలీ కోరుతూ లేఖ రాస్తాం
ఇక సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఎంపీ అరవింద్‌ స్పందిస్తూ.. ‘‘టీఆర్ఎస్ ఎక్కడ ఫ్రేమ్ లో లేదు. యుద్ధం ప్రకటించాలంటే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు రావాలి. ఫెడరల్ ఫ్రంట్ పని అయిపోయింది... ఇప్పుడు మూడో ప్రపంచ యుద్దం చేస్తా అంటుండు ఏం చేస్తడో చూస్తాం. వాళ్ళు మాట్లాడలేదు... వాళ్ళురారు.. ఈ సమావేశం కాదు. ఎన్ని రాష్ట్రాల్లో మతకలహాలు అవుతున్నాయో చెప్పండి. ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ చేతుల్లో సంస్థగా మారింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌ను బదిలీ చేయమని లేఖ రాస్తాం. ప్రజలు డబ్బులకు ఓటెయ్యరు.. ప్రజలు వరద సాయం ఇవ్వమని డిమాండ్ చేయమని చెప్తున్నం. చివాట్లు చెప్పులు పడతాయని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. 

ఎల్బీస్టేడియంలో ప్రజల కంటే ఎక్కువ పో‌లీసులే ఉంటారు. రాష్ట్రంలో ఇల్లు రావాలన్నా.. రిజర్వేషన్లు కావాలన్నా బీజేపీతోనే సాధ్యం. ఎంఐఎం.. టీఆర్ఎస్ లు దోచుకుతింటున్నాయి తప్ప చేసిందేమీ లేదు. మతాలను పక్కన పెట్టి బీజేపీ కి ఓటేయమని కోరుతున్నా. మేం ఎన్ని రాష్ట్రాల్లో ఇల్లు కడుతున్నామో వీడియో విడుదల చేస్తాం. కాంగ్రెస్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. డివిజన్ కు 20 నుంచి 50ఓట్లు మాత్రమే ఆ పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకికు మూడంకెల సంఖ్య ఎక్కడా దాటదు. కాంగ్రెస్ ముక్త్ భారత్ మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు