బీజేపీలో చేరిన విక్రం గౌడ్‌ 

28 Nov, 2020 09:11 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. దుబ్బాక విజయం తర్వాత పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆ పా ర్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ముఖేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రం గౌడ్‌ తదితరులు బీజేపీ జాతీయ నేత భూపేంద్రయాదవ్‌ సమక్షంలో శుక్రవారం పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా విక్రంగౌడ్‌ మాట్లాడుతూ... నగర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగింపలకనున్నాయని జోస్యం చెప్పారు. మాజీ కార్పొరేటర్‌ అరుణాజయేందర్‌ దంపతులు బీజేపీ నేత లక్ష్మణ్‌ సమక్షంలో పారీ్టలో చేరారు. వీరితో పాటు గాంధీనగర్, చిక్కడపల్లి డివిజన్‌లోని కార్యకర్తలు పార్టీలో చేరారు.

బీజేపీ సభ ఏర్పాట్ల పరిశీలన 
యాకుత్‌పురా: జీహెచ్‌ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని పాతబస్తీలో శనివారం నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హాజరు కానున్నారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ తె లిపారు. లాల్‌దర్వాజా మోడ్‌ అల్కా థియేటర్‌ ప్రాంగణంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను నిన్న (శుక్రవారం) ఆమె పార్టీ నాయకులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం అరుణ మాట్లాడుతూ హైదరాబాద్‌ ప్రజలు మార్పు కోరుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో నగరాభివృద్ధి తిరోగమన దిశలో ఉందన్నారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపట్టిన అభివృద్ధే స్ఫూర్తిగా జీహెచ్‌ఎంసీని తీర్చిదిద్దే దిశగా తాము ముందుకెళుతున్నామన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. సేవ్‌ హైదరాబాద్‌... ఓట్‌ ఫర్‌ బీజేపీ నినాదంతో ముందుకెళు తున్నామన్నారు. దుబ్బాక ఎన్నికల్లో మాదిరిగానే జీహెచ్‌ఎంసీలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోనే ఈ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ ఆలే జితేంద్ర, బీజేపీ నాయకులు ఉమామహేంద్ర, కుమార్, రూప్‌రాజ్, పొన్న వెంకటరమణ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు