జనతా గ్యారేజ్‌ X కల్వకుంట్ల గ్యారేజ్‌

30 Nov, 2020 04:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికలు జనతా గ్యారేజ్‌కి, కల్వకుంట్ల గ్యారేజ్‌కి మధ్య జరుగు తున్నవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలతో ఉండే బీజేపీకి ఓట్లు వేస్తారో లేక కల్వకుంట్ల కుటుంబం కోసం ఓట్లు వేస్తారో ఓటర్లు ఆలో చించాలన్నారు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర హోంశాఖ శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్లతో కలసి బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. గ్రేటర్‌ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ పతనం ఖాయమని, సెక్రటేరియట్‌ను కూలగొట్టిన ఆ పార్టీ... బిర్యానీ సెంటర్‌ పెట్టుకోవాల్సిందేనన్నారు. ఫలితాల తర్వాత అమిత్‌ షా వచ్చి బిర్యానీ తిని వెళ్తారన్నారు. 

టీఆర్‌ఎస్‌ది అబద్ధాల ప్రచారం: కిషన్‌రెడ్డి
రాష్ట్రంలో అవినీతి, కుటుంబ రాజకీయాలపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిందని, అయినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్ర మంత్రులు పరామర్శకు రాలేదని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారని... మరి సీఎం ఎక్కడకు వచ్చి తిరిగారో చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో తాము గెలిచి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసు కుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా,  ప్రజల దృష్టిని మరల్చేందుకు కేటీఆర్‌ నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ దుయ్యబట్టారు.

‘టీఆర్‌ఎస్‌ డబ్బులు పంచుతోంది’
టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో డబ్బు, మద్యం అక్రమంగా పంచుతూ ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఆది వారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఓటర్లకు డబ్బు పంచుతుండగా పట్టుకోవడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకులపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. డబ్బులు పంచుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులపై పోలీసులు కేసులు పెట్టట్లేదన్నారు. టీఆర్‌ఎస్‌ అక్రమాలను వివరించడానికి సోమవారం గవర్నర్‌ను కలుస్తామన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు