‘ఇంట్లో చెప్పే వచ్చా.. చావుకు భయపడేది లేదు’

28 Nov, 2020 14:49 IST|Sakshi

బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోతుందని, మధ్యంతర ఎన్నికల వస్తాయని జోస్యం చేప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన రాంనగర్‌లో మాట్లాడుతూ.. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలబడదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుబాటు చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వస్తున్నారని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జాగ్రత్త అని హెచ్చరించారు. కేంద్రం త్వరలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతుందన్నారు.
(చదవండి : బండి సంజయ్‌, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు)

భారత్‌ బయోటెక్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇంట్లో చెప్పే వచ్చానని.. చావుకు భయపడేది లేదన్నారు. ట్యాంక్‌బండ్‌ విగ్రహాలను టచ్‌ చేస్తే కచ్చితంగా దారుసలాంను కూల్చేస్తామని మరోసారి బండి సంజయ్‌ హెచ్చరించారు. ఎక్కువ రోజులు నిలబడని ప్రభుత్వానికి పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలన్నారు.

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు. కేసీఅర్ అవినీతి ప్రభుత్వం కూలిపోతుందని, ఎన్నికలు తప్పవని ఆయన అన్నారు. రాంనగర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన..  ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు పోవటం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కో డివిజన్‌కు 5 కోట్ల రూపాయలు ఇస్తున్నారని, టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోండని ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు