అత్యంత దారుణంగా కాంగ్రెస్‌ పరిస్థితి..

21 Dec, 2021 11:05 IST|Sakshi

ఎన్నికల వేళ గోవా కాంగ్రెస్‌ డీలా

పణజి: నలభై సీట్లున్న గోవా అసెంబ్లీలో 17 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా తయారైంది. ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడుతూ వలసల పర్వాన్ని జోరెత్తించారు. సోమవారం తాజాగా దక్షిణ గోవాలోని కుర్టిమ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో లారెన్కో తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెబుతూ రాజీనామా సమర్పించారు. దీంతో పార్టీలో మిగిలిపోయిన ఎమ్మెల్యేల సంఖ్య సోమవారానికి కేవలం రెండుకు పడిపోయింది.  ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. 

బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మద్దతు
అస్సాంలో సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శశికాంత దాస్‌ సోమవారం ప్రకటించారు. ఇప్పుడే కాంగ్రెస్‌ను వీడబోనన్నారు. ‘తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రహా నియోజకవర్గ అభివృద్థి కోసమే ఆయన.. రాష్ట్ర సర్కార్‌కు మద్దతు ప్రకటించారు. బీజేపీలో చేరతారో లేదో నాకు తెలియదు’ అని సీఎం హిమంత చెప్పారు.

చదవండి: (టార్గెట్‌ 30 లక్షలు.. జరిగింది 2.5 లక్షలే.. ఆ నాలుగు ఓకే.. కానీ!)

మరిన్ని వార్తలు