'కాల్‌మనీ కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి బుద్దా వెంకన్న'

25 Sep, 2021 19:26 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలకు ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. 'బట్ట కాల్చి మీద వేయడం టీడీపీకి అలవాటే. టీడీపీ ట్రైనింగ్ మేరకే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలంతా మాట్లాడుతున్నారు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకే విజయవాడ తప్పుడు అడ్రస్ ఇచ్చారు. 8 ఏళ్ల క్రితమే మాచవరం సుధాకర్ ఏపీ విడిచి చెన్నై వెళ్లిపోయారు. ఏపీకి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు.  చదవండి: ('భారత్‌ బంద్‌కు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు')

కాల్‌మనీ కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి బుద్దా వెంకన్న
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు బుద్ధా వెంకన్న, జీవీ ఆంజనేయులు మాట్లాడుతున్నారు. గతంలో జీవీ ఆంజనేయులు ప్రభుత్వం తయారు చేసే ఫర్టిలైజర్స్ ద్వారా వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. కాల్‌మనీ కేసులో డైరెక్ట్‌గా దొరికిన వ్యక్తి బుద్దా వెంకన్న. ఇలాంటి నాయకులు ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి చర్యలకు పాల్పడరు.

తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు
మాచవరం సుధాకర్ జగన్ అనుచరుడంటూ జీవీ ఆంజనేయులు దుష్ప్రచారం చేస్తున్నారు. అమ్మ ఒడి వంటి అద్భుతమైన పథకాలతో జగన్‌ పాలన చేస్తున్నారు. సీఎం జగన్‌ డ్రగ్స్‌ను ఏపీలోకి రానివ్వరు. ఆధారాల్లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదు. సత్తెనపల్లిలో ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేసిన చరిత్ర టీడీపీది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఘర్షణ కూడా చోటుచేసుకోలేదు. అయ్యన్న పాత్రుడు చాలా నీచంగా మాట్లాడారు. రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్న అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు' అని గోపిరెడ్డి మండిపడ్డారు. 

చదవండి: (రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు: మంత్రి బొత్స)

మరిన్ని వార్తలు