మంత్రి హరీశ్‌ను కలిసిన ఎమ్మెల్యే రాజా సింగ్‌

14 Jul, 2023 15:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీశ్‌రావును గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ కలిశారు. దాంతో రాజా సింగ్‌ బీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే వీటిన రాజా సింగ్‌ ఖండించారు.

‘నేను బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం లేదు. అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీశ్‌ రావును కలిశాను. బీజేపీలోనే ఉంటా,. బీజేపీలోనే చస్తా. బీజేపీ సస్సెన్షన్‌ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ధూల్‌పేటలో మోడల్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌ను కోరాను’ అని తెలిపారు. 

చదవండి: తాత-మనవడు: సీఎం కేసీఆర్‌ను నిలదీద్దాం, రా.. హిమాన్షు!

మరిన్ని వార్తలు