మోదీ జీవితం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: గవర్నర్‌ 

19 Sep, 2021 02:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ జీవితం వర్తమాన, భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ‘నరేంద్ర మోదీ.. ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’పుస్తకం తెలుగు, ఇంగ్లిష్‌ అనువాద ప్రతులను ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మైండ్‌ పవర్‌లో ప్రపంచ రికార్డు గ్రహీత తాటికొండ వేణుగోపాల్‌రెడ్డి, ప్రముఖ రచయిత జర్నలిస్టు విజయార్కే శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు అందజేశారు.

మోదీ జీవితంలోని స్ఫూర్తిదాయక ఘటనలను విశ్లేషిస్తూ ఈ పుస్తకాలను రాసిన పుస్తక రచయితల కృషిని తమిళిసై అభినందించారు. బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు వివేక్‌ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిల సహకారంతో వేణుగోపాల్, విజయార్కే ఈ పుస్తకాలు రచించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు