ప్రజా ప్రస్థాన యాత్రను విజయవంతం చేయాలి

24 Sep, 2022 01:41 IST|Sakshi
మాట్లాడుతున్న గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి 

వైఎస్‌ఆర్‌టీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి

కొండాపూర్‌(సంగారెడ్డి): వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర శనివారం జిల్లాలోకి ప్రవేశించనుందని పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు 160 రోజులుగా షర్మిల పాదయాత్ర చేస్తోందన్నారు.

శనివారం జిల్లాలోని కంబాలపల్లి గ్రామంలో యాత్ర ప్రారంభం అవుతుందని, అక్కడి నుంచి సదాశివపేట పట్టణం, పెద్దాపూర్, నందికంది, తొగర్‌పల్లి, మల్కాపూర్, సంగారెడ్డి, చిద్రుప్ప, బేగంపేట మీదుగా కొనసాగనుందన్నారు. ఈ నెల 25వ తేదీన సంగారెడ్డిలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. తెలంగాణలో రాజన్న పాలన రావాలంటే షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలన్నారు.

సంగారెడ్డిలో నిర్వహించే సభకు వైఎస్‌ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రామలింగారెడ్డి, సంగారెడ్డి జిల్లా పరిశీలకులు శాంతికుమార్, నాయకులు తుకారాం గౌడ్, తులపీదాస్‌ గౌడ్, భీంరెడ్డి, అందోల్‌ నాయకులు ఆమోస్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు