Gujarat Elections 2022: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో..

26 Nov, 2022 14:19 IST|Sakshi

గాంధీనగర్: డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మేనిఫెస్టోలోని పథకాలను ప్రకటించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సహా ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తమకు మరోసారి అధికారం ఇస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు నడ్డా. మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉమ్మడి పౌర స్మృతి ‍అమలుకు చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.  బీజేపీ ఇస్తున్న ఇతర ముఖ్య హామీలు..

ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఆర్థిక సాయం
బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం
ఉగ్రకార్యకపాలు నివారించేందుకు యాంటి రాడికల్ సెల్ ఏర్పాటు..
గుజరాత్ వాసులందరికీ పక్కా ఇళ్లు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 100 శాతం అమలు
మహిళా సీనియర్ సిటిజెన్లకు ఉచిత బస్సు ప్రయాణం
20వేల ప్రభుత్వ స్కూళ్లను ఎక్సలెన్స్‌ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.10వేల కోట్ల కేటాయింపు
బాగా చదివే కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు
చదవండి: అది జైలు కాదు దర్బార్.. ఢిల్లీ మంత్రి మరో వీడియో లీక్‌..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు