Gujarat Exit Poll Results: ప్రధాని రాష్ట్రంలో విరబూసిన కమలం, ఆప్‌ పరిస్థితేంటి?

5 Dec, 2022 20:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్కంఠ రేపిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ ముగిసింది. 182 శాసనసభ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్‌ 1న, డిసెంబర్‌ 5న రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయాయి. 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాషాయ పార్టీ తిరిగి ‘పవర్‌’పంచ్‌ విసరాలని తీవ్రంగా శ్రమించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సొంత రాష్ట్రం కావడంతో మరింత శ్రద్ధ పెట్టారు. అయితే, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంట్రీతో ఈసారి పరిస్థితులు ఎవరికి అనుకూలంగా మారుతాయో చెప్పలేని పరిస్థితి! 

ఈనేపథ్యంలో సోమవారం సాయత్రం విడుదలైన పలు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు గుజరాత్‌లో బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. తర్వాతి స్థానంలో కాంగ్రెస్‌ ఉంది. ఇక ప్రధాని సొంత రాష్ట్రంలో కీలక రాజకీయ మార్పులకు శ్రీకారం చుడతామని చెప్పుకున్న ఆప్‌ చతికిల పడింది. మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

గుజరాత్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు 2022

సంస్థ: రిపబ్లిక్‌

సంస్థ: జన్‌కీ బాత్‌ సర్వే

సంస్థ: పీపుల్స్‌ పల్స్‌     

మరిన్ని వార్తలు