'అందుకోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించింది'

9 Aug, 2022 11:46 IST|Sakshi

సాక్షి, నల్గొండ: స్వార్ధ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేశారని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరులు, భార్య కనిపించలేదా?. రాజగోపాల్ రెడ్డి రాజీనామా బీజేపీకి అవసరం.

రాజకీయంగా విస్తరణ కోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించింది. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం. రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్‌ల చేతికి రాష్ట్రం పోయిన తెలంగాణకు నష్టమే. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రేవంత్‌రెడ్డిపై దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయి' అని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు