కేసీఆర్‌ సర్కార్‌ Vs గవర్నర్‌.. మండలి ఛైర్మన్‌ గుత్తా కీలక వ్యాఖ్యలు 

30 Jan, 2023 12:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేసీఆర్‌ ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల రిపబ్లిక్‌ డే సందర్బంగా చోటుచేసుకున్న మాటల యుద్ధం తాజాగా మరో స్థాయికి చేరుకుంది. కాగా, రాష్ట్ర బడ్జెట్‌ 2023–24 ప్రతిపాదనలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఆమోద్ర ముద్ర వేయలేదు. దీంతో, ఈ విషయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 

ఈ నేపథ్యంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, గుత్తా సుఖేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్‌ వ్యవస్థ, లౌకిక విధానం కాపాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులు రాజ్యాంగానికి ఆటంకం కలిగిస్తున్నాయి. వక్రబుద్దితో రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాలి. శాసన సభ, శాసన మండలి, గవర్నర్‌ ఎవరైనా సరే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునుఏ ధోరణిలో ఉండాలి అంటూ కామెంట్స్‌ చేశారు.  

ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. గవర్నర్‌ సిఫారసుల కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. అయితే గవర్నర్‌ పుదుచ్చేరిలో ఉండడంతో ఈ ప్రతిపాదనలు ఇప్పటివరకు రాజ్‌భవన్‌లోనే ఉండిపోయాయి. 

మరిన్ని వార్తలు