సోషల్ మీడియా పుకార్లు నమ్మొద్దు: గుత్తా సుఖేందర్‌రెడ్డి

4 Oct, 2021 11:42 IST|Sakshi

సాక్షి, నల్గొండ: తాను టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని, అవి పూర్తిగా అవాస్తవమని శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వ‌చ్చే పుకార్లను ఎవ్వరు నమ్మవద్దని, కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. బండి సంజయ్, రేవంత్‌ చడ్డీ గ్యాంగ్‌లా తయారయ్యారని మండిపడ్డారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తే దారి దోపిడీలు జ‌రుగుతాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజ‌ల్ని దోచుకు తింటాయని, చమురు ధరల్ని పెంచుతూ బీజేపీ ప్రజల జేబులను కొడుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అధికారం రావడం కలగానే మిగిలిపోతుందని అన్నారు. రైతు ఉద్యమాన్ని అణిచివేయ‌డం దారుణమని, ఆదివారం యూపీలో న‌లుగురు రైతుల మ‌ర‌ణం కల‌చివేసిందని అన్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు