పొలిటికల్‌ హీట్‌.. నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్‌ రావు కౌంటర్‌!

2 Sep, 2022 15:12 IST|Sakshi

సాక్షి, మెదక్‌: తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల విమర్శలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఇందులో భాగంగా గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. కేసీఆర్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. దీంతో ఆర్థిక మంత్రికి కౌంటర్‌ ఇస్తూ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 

మంత్రి హరీష్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు. ప్రధాని మాటలను దిగజార్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. కేంద్రమంత్రలు నోరు విప్పితే అన్ని అబద్దాలే. బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోంది. పేదలకు మేము ఉచితంగా రేషన్‌ బియ్యం ఇస్తున్నాము. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.  ఆయుష్మాన్‌ భారత్‌లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే.. నేను రాజీనామా చేస్తాను. చేరినట్లైతే నిర్మలా సీతారామన్‌ రాజీనామా చేస్తారా? అని కౌంటర్‌ ఇచ్చారు.

ఇక, గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. లాభాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిన ఘనత కేసీఆర్‌దేనని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రతీ శిశువుపై రూ. 1.25 లక్షల అప్పు ఉంది. తెలంగాణలో అప్పుడే పుట్టిన బిడ్డ కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి మించి తెలంగాణ అప్పులు చేసింది. కేంద్రం నిధులిచ్చినా కేసీఆర్‌ బద్నాం చేస్తున్నారు. ఉపాధీ హామీ పథకం కోసం కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చింది. ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారు. మేం పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉంది అంటూ ఆమె ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: కలెక్టర్‌ అయ్యుండి తెలియదంటారా? నిర్మలా సీతారామన్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు