Harish Rao: బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు

17 Sep, 2021 08:08 IST|Sakshi
హుజూరాబాద్‌లో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు 

ఈటల రాజేందర్‌ గెలిస్తే ప్రజలకేం లాభం?  

హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ కనుమరుగైంది  

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు  

హుజూరాబాద్‌: ‘బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలో లేదు.. వచ్చే అవకాశమే లేదు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఒకవేళ గెలిస్తే ఆ పారీ్టకి ఇద్దరు ఎమ్మెల్యేలకు బదులు ముగ్గురవుతారు. అంతే తప్ప ప్రజలకేం లాభం’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన హుజూరాబాద్‌లో మాజీ స్పీకర్‌ మధుసూదనాచారితో కలసి విశ్వకర్మ సంఘం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, జమ్మికుంటలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌తో పాటు, హుజూరాబాద్‌లో విశ్వకర్మ మనుమయ సంఘం కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ భవన్‌ పేరుతో కమ్యూనిటీ హాల్‌ నిర్మిస్తున్నామని తెలిపారు.  నిన్నటిదాకా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్, కల్యాణలక్ష్మి పథకాన్ని దండుగ అన్నారని, అలాంటి వ్యక్తికి ఓటేస్తారా? అని ప్రశ్నించారు.

‘17 ఏళ్లు ఈటలకు అవకాశమిచ్చారు. ఒక్కసారి గెల్లు శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వండి. ఇన్నేళ్లలో పూర్తి కాని పనులను రాబోయే రెండేళ్లలో పూర్తిచేసి చూపిస్తాం’అని అన్నారు. ‘ఈటల రాజేందర్‌ ఓటుకు రూ.30 వేలు ఇస్తానని అంటున్నాడంట. డబ్బులిచ్చే బదులు గ్యాస్‌ సిలిండర్, పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించేలా చూస్తే మంచిది’అని మంత్రి హరీశ్‌రావు హితవు పలికారు.

మరిన్ని వార్తలు