ఆ హక్కు టీర్‌ఎస్‌కు మాత్రమే ఉంది: హరీశ్‌ రావు

12 Oct, 2020 16:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మాసిటీ వస్తే వందల మందికి ఉద్యోగాలు వస్తాయని యువత చూస్తుంటే దానిని అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క అంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంట్‌, ఇంటింటిక నీళ్లు ఇస్తామంటే వాటిని కూడా కాంగ్రెస్‌ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 2018 హుజుర్‌నగర్‌ ఎన్నికల్లో, ఇవాళ నిజామాబాద్‌ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ గెలిచిందని, రేపు దుబ్బాకలో కూడా టీఆర్‌ఎస్‌ మాత్రమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని ఆ పార్టీ నేతలే వీడి ఇతర పార్టీలో చేరుతున్నారని ఎద్దేవ చేశారు. (చదవండి: దుబ్బాక: ఎన్నికల ప్రచారం రసవత్తరం)

మనిక్కం ఠాగూర్‌, నాగేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారని, ఇప్పుడు దుబ్బాకలో మీటింగ్‌ పెట్టి ప్రజలకు ఏం చేప్తారని విమర్శించారు. ఇంటింటికి దుబ్బాకలో నీళ్లు ఇచ్చింది తమ పార్టీయే అని, ఓటు అడిగే హక్కు కూడా టీఆర్‌ఎస్‌కే ఉందని ఆయన అన్నారు. 24 గంటల కరెంటు ఇస్తుంది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని... కరెంటు ఇవ్వని కాంగ్రెస్‌ వైపా..  బావుల దగ్గర కరెంటు మీటర్లు పెడతా అంటున్నా బీజేపీ వైపు ఉందామా అని పేర్కొన్నారు. 20 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తుంది ఎవరూ? ఎకరానికి 10 వేలు ఇచ్చింది ఎవరూ? ఆలోచింది దుబ్బాక ప్రజలకు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. (చదవండి: టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరిన పొన్నం ప్రభాకర్)

మరిన్ని వార్తలు