Bandaru Dattatreya: నేనూ పేద కుటుంబం నుంచే వచ్చా

27 Aug, 2021 07:27 IST|Sakshi
సత్కరిస్తున్న గొల్లకురుమలు

సాక్షి, జమ్మికుంట(కరీంనగర్‌): ‘నేనూ పేద కుటుంబంలోనే పుట్టా. కష్టపడి ఎదిగాను. కేంద్రమంత్రిగా పనిచేశా. గవర్నర్‌గా కొనసాగుతున్నా. ఇందుకు కారణం ఉన్నత చదువులు చదవడమేనని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గొల్లకురుమలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కారసభకు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గొల్లకురుమల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ గొల్ల,కురుమలు గొర్లకాపరులుగా ఆగిపోవద్దన్నారు. వ్యాపారవేత్తలుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలని సూచించారు. గొల్ల కురుమలను ఎస్సీ జాబితాలో కలపాలనే వినతిని సర్కారుకు సిఫారసు చేస్తానన్నారు. వరంగల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉన్ని పరిశ్రమ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ తుల ఉమ, నాయకులు మహిపాల్, రవీందర్, మల్లేశ్, సురేశ్, సాయిబాబా పాల్గొన్నారు. 

చదవండి: ఈటల గెలిస్తే ప్రభుత్వం కూలుతుందా?

   

మరిన్ని వార్తలు