గల్లంతైన ఎమ్మెల్యే టికెట్‌ ఆశలు.. హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అడుగులు ఎటువైపు?

23 Aug, 2023 12:47 IST|Sakshi

కొత్తగూడెం బీఆర్ఏస్ ఎమ్మెల్యే టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్ రావు ఆశలు గల్లంతయ్యాయి. టికెట్ ఆశించి భంగపాటే మిగిలింది. చేయాల్సిన ప్రయత్నాలు  అన్ని చేసిన వర్క్ అవుట్ కాలేదన్న భావనలో ఉన్నారు గడల. ఎమ్మెల్యే చాన్స్‌ చేజారడటంతో గడల సైలెంట్ అయిపోతారా? లేక వేరే దారి చూసుకుంటారా? గడల పొలిటికల్ రూట్ మ్యాప్ ఏవిధంగా ఉండబోతుంది?

ఒక్కరోజు ముందు కూడా హడావిడి
బీఆర్ఏస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు నిరాశే మిగిలింది. టికెట్‌పై ఏన్నో ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ దీవెనెలు సైతం తనకే ఉంటాయన్నారు. బీఆర్ఏస్ అభ్యర్థుల ప్రకటనకు ఒక్క రోజు ముందు కూడ కొత్తగూడెంలో హడావుడి చేశారు. కొత్త కొత్తగూడెం నినాదంతో కొత్తగూడెం మున్సిపాలిటీలో పాదయాత్ర ప్రారంభించారు.

రాజకీయం అంటేనే సేవ.. కట్‌ చేస్తే!
23 వ వార్డులోని అమ్మవారి ఆలయంలో పూజ నిర్వహించి జీఎస్‌ఆర్‌ ట్రస్ట్ సభ్యులతో కలిసి గడప గడపకి పాదయాత్ర చేపట్టారు. గడప గడపకు వెళ్తూ అడపడుచులకు పసుపు-కుంకుమ, గాజులు, కరపత్రంతో కలిగిన ప్యాకెట్ ఇస్తూ వార్డులో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయాల్లోకి రావడంపై డాక్టర్ గడల శ్రీనివాస రావు స్పందిస్తూ రాజకీయం అంటేనే సేవ అని, కొత్తగూడెంలో ప్రజలకు సేవ చేయటం తన కర్తవ్యంగా భావిస్తున్నానన్నారు. ఇంటింటికీ పాదయాత్ర భారీ ఆర్భాటంతో చేపట్టడంతో అధికార బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలోనూ పెద్ద చర్చకే దారి తీసింది. సీన్ కట్ చేస్తే..

హెల్త్‌ డైరెక్టర్‌గానే కొనసాగుతారా? లేక
మరుసటి రోజే బీఆర్ఏస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్‌లో కొత్తగూడెం టికెట్ సిట్టింగ్ ఏమ్మేల్యే వనమా వెంకటేశ్వర్ రావుకే దక్కింది. దీంతో గడల ఆశలు గల్లంతై పోయాయని కొత్తగూడెం నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తుంది. టికెట్ దక్కకపోవడంతో గడల కార్యచరణ ఏ విధంగా ఉండబోతుందన్న చర్చ నడుస్తుంది. హెల్త్ డైరెక్టర్ గానే కోనసాగుతారా? లేక వేరే దారి చూసుకుంటారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.
చదవండి: కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌ రాజీనామా

వేరే పార్టీలోకి!
ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకునే అవకాశం ఉంటే.. హెల్త్ డైరెక్టర్ పదవి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పట్లో వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో సైలెంట్‌గా ఉండే వచ్చేసారి ఏమైనా గుర్తించండి అని కేసీఆర్ నుంచి హమీ తీసుకొని తన పని చేసుకుంటారా అన్న చర్చ నడుస్తుంది.

ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా..
తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు సొంత ప్రాంతమైన కొత్తగూడెంలో కొన్ని నెలలుగా జీఎస్‌ఆర్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కేవలం వికెండ్‌లో మాత్రమే ఉంటాయి. అయితే గడల వ్యవహరంపై గతంలో ప్రతిపక్షాలు తీవ్రస్తాయిలో పైర్ అయ్యాయి. హెల్త్ డైరెక్టర్‌గా ఉండి రాజకీయాలు చేయడం ఏంతవరకు సబబని నిలదిశాయి. అదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలను సైతం గడల పెద్దగా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటు వెళ్లారు.

చేయాల్సిన ప్రయత్నాలు చేసినా.. చివరికి భంగపాటే
జీఎస్‌ఆర్‌ ట్రస్ట్ పేరుతో గడల కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుంచి అనేక వివాదాలు గడల చుట్టు తిరుగుతూ వచ్చాయి. ఓ ఏంపీపీ ఇంట్లో మిరపకాయ పూజలు చేయడం, అనేక కార్యక్రమాల్లో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పెద్ద దూమారమే రేపాయి. అంతేకాదు ప్రగతి భవన్‌లో నిమిషం వ్యవధిలో రెండు సార్లు సీఏం కేసీఆర్ కాళ్లు మొక్కడంపై సైతం ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. ఇలా నిత్యం వివాదాల్లోనే ఉంటు వచ్చారు గడల.. ఇవన్నీ పక్కన పెట్టి కొత్తగూడెం టికెట్ కోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసినా చివరకు భంగపాటే మిగిలిందన్న భావనలో ఉన్నారు గడల శ్రీనివాస్ రావు.. మరి హెల్త్‌ డైరెక్టర్‌ పొలిటికల్ ఎంట్రీ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని వార్తలు