Himachal Pradesh Exit Poll: హిమాచల్‌లో పుంజుకున్న కాంగ్రెస్‌.. రెండో స్థానంలో ఎవరంటే!

5 Dec, 2022 20:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరు తప్పేలా లేదు. 68 శాసనసభ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి నవంబరు 12న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టి చరిత్ర సృష్టించాలని కాషాయ పార్టీ తీవ్రంగా శ్రమించగా.. తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ శత విధాల ప్రయత్నించింది.

కాగా, 1985 నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో ఏ అధికార పార్టీ వెంటనే తిరిగి అధికారంలోకి రాలేదు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పలు సంస్థలు హిమాచల్‌ ప్రదేశ్‌ ఎగ్జిట్ పోల్‌ ప్రకటించాయి. ఈ ఫలితాల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 
చదవండి: Gujarat Exit Poll Results: ప్రధాని రాష్ట్రంలో విరబూసిన కమలం, ఆప్‌ పరిస్థితేంటి?

పోటా-పోటీ
గత రెండేళ్లలో తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్‌కు హిమాచల్‌లో భారీ ఊరట లభించినట్లు తెలుస్తోంది. పీపుల్స్‌ పల్స్‌ చేసిన సర్వే ప్రకారం బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ నెలకొంది. కాంగ్రెస్‌కు 29-39 సీట్లు వచ్చే అవకాశం ఉండగా.. బీజేపీ 27 నుంచి 37 వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇతరులు 2 నుంచి 5 స్థానాల్లో విజయం సాధించనున్నట్లు పేర్కొంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య 0.4 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉన్నట్లు తెలిపింది.

అయితే పంజాబ్‌ విజయంతో స్పీడ్‌ మీదున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ హిమాచల్‌ ప్రదేశ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 2.1 ఓటింగ్‌ షేర్‌ను మాత్రమే పొందింది. అయితే  68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ 35. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్రులు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

టైమ్స్‌ నౌ

రిపబ్లిక్‌ టీవీ

ఆక్సిస్‌ మై ఇండియా సర్వే
బీజేపీ 24-34
కాంగ్రెస్‌ 30-40
ఆప్‌-0

ఇండియా టీవీ
బీజేపీ 35-40
కాంగ్రెస్‌ 26-31
ఆప్‌ -0

న్యూస్‌ ఎక్స్‌, జన్‌కీ బాత్‌
బీజేపీ 32-40
కాంగ్రెస్‌27-34
ఆప్‌-0

జీ(ZEE)
బీజేపీ 35-40
కాంగ్రెస్‌ 20-25
ఆమ్‌ ఆద్మీ పార్టీ 0-3
ఇతరులు 1-5

పీపుల్స్‌ పల్స్‌

మరిన్ని వార్తలు