కాంగ్రెస్‌ పాలన స్కాములమయం

11 Nov, 2022 06:37 IST|Sakshi

సులాహ్‌: హిమాచల్‌ప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు. విశ్వసనీయత లేని వారి హామీలను ప్రజలను నమ్మరంటూ కాంగ్రెస్‌ ప్రకటించిన 10 హామీలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన గురువారం కంగ్రా జిల్లా సులాహ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌ షా ప్రసంగించారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ పాలనలో చోటుచేసుకున్న కుంభకోణాలు లెక్కకు మిక్కిలి ఉండగా, బీజేపీ హయాంలో 2014 నుంచి ఒక్క స్కాము కూడా కనిపించదని చెప్పారు. 2004–14 సంవత్సరాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో రూ.12 లక్షల కోట్ల మేర కుంభకోణాలు జరిగాయన్నారు. కాంగ్రెస్‌ వంటి పార్టీలిచ్చే ఎన్నికల హామీలను హిమాచల్‌ ప్రజలు నమ్మరని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం జైరాం ఠాకూర్‌లు కలిసి హిమాచల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు