శివసేనపై హోంమంత్రి ఆగ్రహం

16 Dec, 2021 07:04 IST|Sakshi

సాక్షి, బనశంకరి(కర్ణాటక): శివసేన కార్యకర్తలు కన్నడ పతాకాన్ని కాల్చివేయడం సరైన చర్య కాదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నమని హోంమంత్రి అరగజ్ఞానేంద్ర మండిపడ్డారు. బుధవారం బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ... మరాఠీలు, కన్నడిగులు అనే భేదభావం లేకుండా ప్రజలు ఉన్నారన్నారు. కానీ కొందరు శాంతికి భంగం కలిగించేందుకు యత్నిస్తున్నారు, దీనిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామన్నారు.

ఈ ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అనేక ధర్నాలు జరుగుతున్నాయని, వాటన్నింటిని సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు. కాగా, పోలీసుల వసతి, వేతన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.    

చదవండి: లఖీంపూర్‌ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ

మరిన్ని వార్తలు