ఇంగ్లీష్‌ మీడియంపై చంద్రబాబు వ్యాఖ్యలు.. హోంమంత్రి కౌంటర్‌

7 May, 2022 16:46 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంగ్లీష్‌ మీడియంపై చంద్రబాబు వ్యాఖ్యలకు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కౌంటర్‌ ఇచ్చారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టామని ఆమె అన్నారు. ‘‘వాళ్ల పిల్లలను విదేశాల్లో ఇంగ్లీష్‌ మీడియం చదివించుకోవచ్చు.. పేదలు ఇంగ్లీష్‌ చదువులు చదవకూడదన్నదే చంద్రబాబు రూల్‌’’ అంటూ మంత్రి మండిపడ్డారు.
చదవండి: బాబు పర్యటనకు దూరంగా గంటా శ్రీనివాసరావు

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవ్వేనా?.ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మొద్దబ్బాయిల్లా మారతారని తమకు ఇప్పటివరకూ తెలియదు. అలా కూడా ఆలోచించవచ్చా అని ప్రతిపక్షనేత చెప్పే వరకూ  తెలియదంటూ మంత్రి ఎద్దేవా చేశారు. 

‘‘ఈ మూడేళ్లు రాష్ట్రంలో జగన్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వాల కంటే సంతోషంగా ఉన్నామని ధైర్యంగా చెబుతున్నారు. కరోనా సమయంలో టీడీపీ నేతలు ఎక్కడున్నారో వారికే తెలియదు. ఇప్పుడేమో జనాన్ని ఉద్దరించేస్తామని తయారయ్యారు. సీఎం జగన్‌ను పిల్లలందరూ మేనమామగా భావిస్తున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే ఇంగ్లీష్ మీడియం’’ అని మంత్రి తానేటి వనిత అన్నారు.

మరిన్ని వార్తలు