గుజరాత్‌లో వారి నుంచి బీజేపీకి ఎదురుగాలి తప్పదా?

24 Nov, 2022 16:46 IST|Sakshi

ఢిల్లీ, పంజాబ్‌ ఎన్నికల్లో ఘన విజయాలతో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెంచింది. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. పలు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు వినూత్న ప్లాన్స్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గుజరాతీలకు కీలక హామీలు సైతం ఇస్తున్నారు.

మరోవైపు.. ఇదే సమయంలో ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలపై కూడా ఆప్‌ సర్కార్‌ ఫోకస్‌ పెంచింది. కానీ.. కేజ్రీవాల్‌కు అనుకోని రీతిలో కొన్ని షాక్‌లు తగులుతున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌.. ఆప్‌ నేతలను టార్గెట్‌ చేయడంతో కేజ్రీవాల్‌ ఢిల్లీ డిఫెన్స్‌లో పడినట్టు తెలుస్తోంది. కాగా, లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎంను సీబీఐ అరెస్ట్‌ చేయడం, తీహార్‌ జైలులో మంత్రి సత్యేంద్ర జైన్‌కు అధికారులు సపర్యలు చేయడం వంటి వీడియోలు బయటకు రావడంతో అనుకోని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఎన్నికల సమీపిస్తున్న కొద్ది ఆప్‌పై బీజేపీ ముప్పెట దాడి చేస్తోంది. 

కాగా, ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఆప్‌ సర్కార్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ప్రజల దృష్టికి ఇటీవల జరిగిన ఘటనలపై ప్రచారం మొదలుపెట్టింది. ఇక, మున్సిపల్‌ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టిన కేజ్రీవాల్‌.. నవంబర్‌ 25వ తేదీ నుంచి ప్రచారంలోకి దిగనున్నారు. రోడ్‌ షోలు, ఢిల్లీలో పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. తాము ఢిల్లీలో చేసిన అభివృద్ధే తమకు విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆప్‌ గెలుపే టార్గెట్‌గా పౌర సమస్యలపై దృష్టిపెట్టింది. 

ఇదిలా ఉండగా.. గుజరాత్‌ ఎన్నికల్లో కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్పీడ్‌ పెంచారు. ఇక, గుజరాత్‌లో ఎన్నికలపై పలు సర్వేలు సైతం ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఆప్‌కు గుజరాత్‌లో మంచి ఆదరణ ఉందని సర్వేలు చెప్పుకొచ్చాయి. మరోవైపు.. గుజరాత్‌లో బీజేపీలో చేరిన పాటిదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌కు షాక్‌ తగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హార్దిక్‌ పటేల్‌.. 2015లో పాటిదార్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశారు. ఈ పోరాటం బీజేపీకి వ్యతిరేకంగానే కొనసాగింది. కానీ, ఇటీవల హార్దిక్‌.. కాషాయతీర్థం పుచ్చుకోవడంతో ఆయనపై పాటిదార్లు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఇక, గుజరాత్‌లోని విర్మగం అసెంబ్లీ స్థానం నుంచి హార్దిక్‌ పటేల్‌ పోటీలో నిలిచారు. 

మరిన్ని వార్తలు