Huzurabad Bypoll 2021: బరిలో 30 మంది.. 

14 Oct, 2021 06:48 IST|Sakshi

హుజూరాబాద్‌ ఉపఎన్నిక

ఆఖరురోజు తప్పుకున్న 12 మంది అభ్యర్థులు 

వైదొలగినవారిలో ఈటల జమున, ఒంటెల లింగారెడ్డి  

కాలీఫ్లవర్, పెన్నుపాళీ గుర్తులపై బీజేపీ శ్రేణుల ఆందోళన  

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బీజేపీ నుంచి ఈటల జమున, కాంగ్రెస్‌ నుంచి ఒంటెల లింగారెడ్డితోపాటు మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక 30 మంది మాత్రమే తుదిపోరులో నిలిచారు. బరిలో ఉన్న అభ్యర్థులందరికీ గుర్తులు కేటాయించామని హుజూ రాబాద్‌ ఆర్డీవో రవీందర్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ల స్వీకరణ, స్రూ్కటినీ, ఉపసంహరణ కార్యక్రమాలు పూర్తిచేశామని తెలిపారు. రెండు ఈవీఎం(ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌)లతోనే ఓటింగ్‌ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

ఉపపోరులో ఇద్దరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు 
దాదాపు వెయ్యిమంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉపఎన్నికలో పోటీ చేయాలని అనుకున్నారు. నామినేషన్ల దాఖలుకు దాదాపు అన్ని జిల్లాల నుంచి వారు భారీగా తరలివచ్చారు. అయితే ఎన్నికల నిబంధనల పేరిట అధికారులు వారిని వెనక్కి పంపారు. చివరిరోజు 12 మంది మాత్రమే నామినేషన్లు వేయగలిగారు. వీరిలోనూ తొమ్మిది మంది నామినేషన్లను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. కమలాపూర్‌కు చెందిన గుర్రం కిరణ్‌ అనే ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బుధవారం నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌కు చెందిన తిరుపతి నాయక్‌ (గౌను గుర్తు), వరంగల్‌ జిల్లా పర్వతగిరికి చెందిన గంజి యుగంధర్‌ (కుండ గుర్తు) మాత్రమే తుదిపోరులో నిలిచారు. వీరు త్వరలోనే హుజూరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు      సమాచారం. గుర్తుల కేటాయింపు ఇలా.. 

ప్రధానపార్టీల నుంచి ఈటల రాజేందర్‌ (బీజేపీ), గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ (టీఆర్‌ఎస్‌), బల్మూరి వెంకట్‌ (కాంగ్రెస్‌) బరిలో నిలిచారు. మిగిలిన ఏడుగురు రిజిస్టర్డ్‌ పార్టీలవారు కాగా, మరో 20 మంది ఇండిపెండెంట్లు. వీరికి ఎన్నికల సంఘం బుధవారం గుర్తులు కేటాయించింది. స్వతంత్రులకు కేటాయించిన కాలీఫ్లవర్, పెన్నుపాళీ గుర్తులు కమలం గుర్తును పోలి ఉన్నాయని, దీంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలున్నాయని బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

బరి నుంచి తప్పుకున్నది వీరే
1.ఈటల జమన(బీజేపీ) 
2. ఒంటెల లింగారెడ్డి (కాంగ్రెస్‌) 
3.కొలుగూరి రాజ్‌కుమార్‌ 
4.ఎమ్మడి రవి
5.అంగోత్‌ వినోద్‌కుమార్‌ 
6.రేకల సైదులు
7.కౌటం రవీందర్‌
8. ఎనగందుల వెంకటేశ్వర్లు 
9.నూర్జహాన్‌ బేగం
10. వరికోలు శ్రీనివాస్‌ 
11.పెట్టెం మల్లిఖార్జున్‌ 
12 గుర్రం కిరణ్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు