కేటీఆర్‌ వ్యాఖ్యలపై భట్టి అభ్యంతరం

23 Oct, 2021 17:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీభవన్‌లోకి గాడ్సేలు దూరారన్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపట్ల కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో గాడ్సేలు ఉన్నారని ఆయన ఎలా మాట్లాడతారని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ భావజాలాన్ని తూ.చా తప్పకుండా అమలు చేసే వ్యక్తులు మాత్రమే గాంధీ భవన్‌లో ఉంటారని భట్టి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడారు.

హుజురాబాద్ ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించాలని చాలా స్పష్టంగా ఉన్నారని భట్టి జోస్యం చెప్పారు. ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడుగా వెంకట్ చాలా ఏళ్లుగా విద్యార్థి, యువత కోసం గట్టిగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి పోరాటాలు చేసే అభ్యర్థిని శాసనసభకు పంపించాలని హుజూరాబాద్ ప్రజలు ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.
(చదవండి: పిట్టపోరు.. హెల్మెట్లు లేకపోతే అంతే!)

దోచుకోవడం వల్లనే ఉప ఎన్నిక
‘అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఎన్నికల కమిషన్ ఎన్నికను రద్దు చేయడం వల్లనో, లేక దురదృష్టకర ఘటన వల్లనో ఉప ఎన్నిక రాలేదు. కేవలం ఏడేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ విపరీతమైన అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి తాను మంత్రి పదవినుంచి తొలిగిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. అంతేకాక ఆయన మీద ఎంక్వైరీ వేశారు. 

నేనొక్కడినే కాదు అవినీతి చేసింది.. స్కూటర్ మీద వచ్చిన టీఆర్ఎస్ నాయకత్వం లక్షల కోట్లు రాష్ట్ర ఆదాయాన్ని దోచుకున్నారని రాజేందర్ అంటున్నారు. దోపిడీ దొంగలు ఒకరు బీజేపీ నుంచి మరొకరు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. హుజారాబాద్ ప్రజలు ఈ దోపిడి దొంగలను ఆపాలంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయాలని ఆలోచన చేస్తున్నారు’ అని భట్టి పేర్కొన్నారు.
(చదవండి: సీఎంను పట్టుకుని ఆ బూతులేంటి?: కేటీఆర్‌)

మరిన్ని వార్తలు