Huzurabad Bypoll: రసవత్తరంగా మారిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక

4 Oct, 2021 06:46 IST|Sakshi

హుజూరాబాద్‌ బరిలో పట్టభద్రులు

పోటీకి వెయ్యిమంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు, 200 మంది నిరుద్యోగులు

ఈసారి భారీగా పెరగనున్న పోలింగ్‌

నామినేషన్‌కు మిగిలింది నాలుగురోజులే!

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. బరిలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉన్నత విద్యావంతు లు కావడమే ఇందుకు కారణం. అభ్యర్థి మొదలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో వచ్చిన మా ర్పుల దాకా అన్నీ ఈసారి ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ఉపఎన్నిక బరిలో ప్రధానపార్టీల అభ్యర్థులు, వందలాదిమంది నిరుద్యోగులతో పాటు పీల్డ్‌ అసి స్టెంట్లు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వందలాదిగా నామినేషన్లు..?
ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చడం లేదన్న కారణంతో ఈసారి దాదాపు 1000 మంది వరకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.ప్రతీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసేందుకు కనీసం రూ.10వేల ధరావతు, అభ్యర్థికి మ ద్దతిస్తూ స్థానికంగా పదిమంది సంతకాలు చేయా లి. వీరంతా పోటీ చేయాలంటే కనీసం రూ.కోటి నగదు,కనీసం 10వేలమంది స్థానికుల మద్దతు అవసరం. వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో 200 మంది నిరుద్యోగులు బరిలో నిలుచుంటామంటున్నారు. ఈ అందరికీ ధరావతు, స్థానికుల మద్దతు ఎంతమేరకు లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 

చదవండి: (జోరు పెంచిన కమలం)

ఇంటర్‌ కేంద్రాల మార్పు..
ఇంటర్‌ పరీక్ష కేంద్రాలు, ఉప ఎన్నిక కోసం జిల్లా యంత్రాంగం ఎంచుకున్న జూనియర్‌ కాలేజీల వి షయంలో పీఠముడి పడింది. జమ్మికుంట, హుజూరాబాద్‌లో పరిస్థితి తలెత్తింది. 29, 30వ తేదీల పరీక్షలు వాయిదా వేస్తారా? లేక ఈ నాలుగు కేంద్రాలకు సెంటర్లు మారుస్తారా? అన్న విషయం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

72 గంటలముందే ప్రచారం బంద్‌ 
కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఈసారి ఎన్నికల నిబంధనలో మార్పు తీసుకువచ్చారు. ప్రస్తుతం 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయనున్నారు. ఉదయం 7నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనల వల్ల దూర ప్రాంతాల నుంచి ఓటర్లు సులువుగా చేరుకునే వీలుంది. వీలైనంత మంది ఎక్కువమంది ఓటు వేసే అవకాశం చిక్కనుండటంతో ఈసారి పోలింగ్‌ భారీగా పెరగనుంది. పోయినసారి దాదాపు 1.60 లక్షల ఓట్లు పోలయ్యాయని, ఈ ఉప ఎన్నికలో రెండు లక్షల కంటే ఎక్కువగా ఓట్లు పోలవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

మిగిలింది నాలుగురోజులే!
ఈనెల 1నుంచి నామినేషన్‌ దాఖలు ప్రారంభమైంది. ఇప్పటిదాకా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాత్రమే నామినేషన్‌ వేశారు. రాజేందర్‌ (బీజేపీ), బల్మూరి వెంకట్‌ నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం నామినేషన్‌కు మరో నాలుగురోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈనెల 2న గాంధీ జయంతి, అక్టోబరు 3న ఆదివారం సెలవు వచ్చాయి. 6వ తేదీ ఎంగిలిపూల అమావాస్య ఉంది. ఆ రోజు పెద్దగా నామినేషన్లు వేయకపోవచ్చు. మిగిలిన రోజుల్లో ఎన్ని నామినేషన్లు వస్తాయన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ముగ్గురూ గ్రాడ్యుయేట్లే 
టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. ముగ్గురూ గ్రాడ్యుయేట్లే కావ డం గమనార్హం. హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా రాజీనా మా చేసి బీజేపీ నుంచి బరిలో ఉన్న ఈటల రాజేందర్‌ ఉస్మానియా నుంచి బీఎస్సీలో డిగ్రీ తీసుకున్నా రు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా ఉస్మానియా నుంచి ఎంఏ పట్టా పొందారు. కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచిన బల్మూరి వెంకట్‌ కూడా ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్‌ కావడం విశేషం. ముగ్గురూ విద్యార్థి రాజకీయ నేపథ్యమే. 

బీజేపీ అభ్యర్థిగా ఈటల ఖరారు
హుజురాబాద్‌ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ పేరును పార్టీ ఖరారు చేసింది.టీఆర్‌ఎస్‌తో విభేదించిన ఆయన అనూహ్య పరిణా మాల మధ్య మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీ నామా చేయడం, ఆ వెంటనే బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. ఒకదశలో బీజేపీ నుంచి ఈటల  లేదా ఆయన భార్య పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఈలోపు టీఆర్‌ఎస్‌ నుంచి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, కాంగ్రెస్‌ నుంచి బల్మూరి వెంకట్‌ల పేర్లు ఖరారయ్యాయి. దీంతో రాజేందర్‌ అభ్యర్థిత్వంపై హుజూరాబాద్‌లో కాస్త ఉత్కంఠ రేగింది. మొత్తానికి 16 వారాల సస్పెన్స్‌  అనంతరం అధిష్టానం ఆయన పేరును ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు