Huzurabad Bypoll: కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి ఆడియో క్లిప్‌ వైరల్‌

12 Jul, 2021 09:55 IST|Sakshi

సాక్షి, హుజురాబాద్‌: ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన బీజేపీలో చేరడంతో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అన్నట్టుగా హుజురాబాద్‌ ఉప ఎన్నిక మారింది. అయితే, కాంగ్రెస్‌ నేత, గతంలో హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఈటల చేతిలో ఓటమిపాలైన పాడి కౌశిక్‌ రెడ్డిని టీఆర్‌ఎస్‌ తనవైపునకు తిప్పుకుంటుందా అనే ఊహాగానాలు వెలువడ్డాయి.  తాజాగా బయటపడిన ఓ ఆడియో క్లిప్‌ వ్యవహారం కౌశిక్‌ రెడ్డి కారెక్కడం ఖాయమనే ప్రచారానికి ఊతం ఇస్తోంది.

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి వాయిస్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తనకే టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తుందని ఫోన్ల ద్వారా కౌశిక్‌రెడ్డి స్థానిక నాయకుల వద్ద చెప్తున్నట్టు వైరలైన ఆడియో క్లిప్‌ ద్వారా తెలుస్తోంది. రానున్న ఉపఎన్నికల్లో తానే టీఆర్‌ఎస్‌ అభ్యర్థినంటూ కౌశిక్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. మాదన్నపేట్‌కు చెందిన యువకుడితో కౌశిక్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు