Huzurabad By Election Results 2021: ఈటల రాజేందర్‌ ఘన విజయం

3 Nov, 2021 01:25 IST|Sakshi

Live Updates:
06:30PM: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. 22వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. 22వ రౌండ్‌లో 1333 ఓట్ల లీడ్‌ను బీజేపీ సాధించింది. 22 రౌండ్లు ముగిసిన తర్వాత  23,855 ఓట్ల ఆధిక్యంతో ఈటల రాజేందర్‌ భారీ  విజయాన్ని సాధించారు.

06:21PM: 21వ రౌండ్‌లో బీజేపీ 1720 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 21వ రౌండ్‌లో బీజేపీ-5151, టీఆర్‌ఎస్‌-3431 ఓట్లు వచ్చాయి. 21 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ మొత్తం 22,735 ఓట్ల ఆధిక్యం సాధించారు. 

05:58PM: 20వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం.  20వ రౌండ్‌లో బీజేపీ 1474 లీడ్‌లో ఉంది. 20 రౌండ్లు ముగిసేసరికి ఈటల ఆధిక్యం 20 వేలు దాటింది. ఈటల రాజేందర్‌ 21,015 లీడ్‌లో ఉన్నారు. 

05:41PM: 19వ రౌండ్‌లో ఈటల ఆధిక్యంలో దూసుకెళ్లుతున్నారు. 19వ రౌండ్‌లో ఈటల 3047 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 19,541 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. 19 రౌండ్‌ ముగిసేసరికి మొత్తంగా బీజేపీ-91,306, టీఆర్‌ఎస్‌-71,771, కాంగ్రెస్‌- 2660 ఓట్లు వచ్చాయి.

05:24PM: 18వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 1976 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ ఈటల రాజేందర్‌ ఆధిక్యం 15 వేలు దాటింది. 18 రౌండ్లు ముగిసేసరికి ఈటల16, 594 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుతున్నారు. 18వ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీ-85,396, టీఆర్‌ఎస్‌-68,902, కాంగ్రెస్‌-2563 ఓట్లు వచ్చాయి.

04:59PM: 17వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. 17వ రౌండ్‌లో బీజేపీ-5610, టీఆర్‌ఎస్‌-4187 ఓట్లు వచ్చాయి. 17వ రౌండ్‌లో బీజేపీ 1423 లీడ్‌ సాధించింది. 17వ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 14618 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బీజేపీ- 79,785, టీఆర్‌ఎస్‌-65,167, కాంగ్రెస్‌- 2469 ఓట్లు వచ్చాయి. సిలివేరు శ్రీకాంత్(చపాతీ మేకర్ గుర్తు) అభ్యర్థి 1468 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.

04:38PM: 16వ రౌండ్‌లోనూ బీజేపీ లీడ్‌లో ఉంది. 16వ రౌండ్‌లో బీజేపీ 1712 ఓట్ల ఆధిక్యం సాధించింది.16వ రౌండ్‌లో బీజేపీ-5689, టీఆర్‌ఎస్‌-3917 ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 13,255 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. 

04:08PM: 15వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది.15వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 2149 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 15 వ రౌండ్‌లో బీజేపీ-5507, టీఆర్‌ఎస్‌- 3358 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యం 10 వేలు దాటింది. ఇప్పటివరకు ఈటల రాజేందర్‌ 11,583 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు బీజేపీ-68,486, టీఆర్‌ఎస్‌- 57,003, కాంగ్రెస్‌-1982 ఓట్లు సాధించాయి.

03:44PM: 14వ రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం సాధించింది. 14వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 1046 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 14వ రౌండ్‌లో బీజేపీ-4746, టీఆర్‌ఎస్‌-3700, కాంగ్రెస్-152 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు బీజేపీ 63079, టీఆర్‌ఎస్‌-53627 ఓట్లు సాధించగా.. బీజేపీ 9434 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతోంది.

03:20PM: 13వ రౌండ్‌లో ఈటల ఆధిక్యం సాధించారు. 13వ రౌండ్‌లో బీజేపీ 1865 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 13వ రౌండ్‌లో బీజేపీ- 4836, టీఆర్‌ఎస్‌-2971, కాంగ్రెస్‌-101 ఓట్లు వచ్చాయి. 13 రౌండ్లు ముగిసేసరికి ఈటల మొత్తం 8,388 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం బీజేపీ-58,333, టీఆర్‌ఎస్‌- 49,945 ఓట్లు వచ్చాయి.

03:08PM:12 రౌండ్‍లో బీజేపీ 1217 ఓట్ల ఆధిక్యం సాధించింది. 12 రౌండ్‌లో బీజేపీ-4849, టీఆర్‌ఎస్‌-3632, కాంగ్రెస్‌-158 ఓట్లు వచ్చాయి. 12 రౌండ్ల తర్వాత 6523 ఓట్ల ఆధిక్యంలో  బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ దూసుకుపోతున్నారు.

02:42PM: 11వ రౌండ్‌లో మళ్లీ ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ. 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 385 ఓట్ల ఆధిక్యం సాధిం‍చింది. 11 వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌-4326, బీజేపీ-3941, కాంగ్రెస్‌-104 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు బీజేపీ-48,588, టీఆర్‌ఎస్‌- 43,324 ఓట్లు వచ్చాయి. 11 రౌండ్లు  ముగిసేసరికి 5, 306 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.

02:31PM: బీజేపీ అభ్యర్థి ఈటల పదో రౌండ్‌లోను ఆధిక్యం సాధించారు. 10 రౌండ్ల తర్వాత 5631 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ దూసుకుపోతుంది. పదో రౌండ్‌లో బీజేపీ 526 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ-4295, టీఆర్‌ఎస్‌-3709 ఓట్లు సాధించాయి.

02:24PM
హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడు కొనసాగుతోంది. ఇక ఇప్పటికి వరకు
హుజూరాబాద్, వీణవంక మండలాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి అయింది.

02:00PM
బీజేపీ దూకుడు
హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడును ప్రదర్శిస్తోంది. ఒక్క ఎనిమిదో రౌండ్‌ మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల స్పష్టమైన మెజార్టీని కొనసాగిస్తున్నారు. 

01:52PM
9వ రౌండ్‌లో ఈటల 1835 ఓట్ల ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి ఈటల తొమ్మిదో రౌండ్‌లోనూ ఆధిక్యం సాధించారు. 9వ రౌండ్‌లో ఈటల 1835 ఓట్ల ఆధిక్యం సాధించి మొత్తంగా.. 5,105 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 9వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 3,470.. బీజేపీ 5,305.. కాంగ్రెస్‌ 174 ఓట్లు సాధించాయి.

చదవండి: (Huzurabad ByElection: రౌండ్ల వారీగా హుజూరాబాద్‌ బైపోల్‌ ఫలితాలు)

01:42PM
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్వగ్రామంలోనూ బీజేపీ ఆధిక్యం
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ సొంత గ్రామం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో ఆయన వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ 190 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ఇక్కడ బీజేపీ 548 ఓట్లు సాధించగా.. టీఆర్‌ఎస్‌ 358 ఓట్లు సాధించింది.

01:22PM
టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 162 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎనిమిది రౌండ్ల తర్వాత బీజేపీ 35,107.. టీఆర్‌ఎస్‌ 31,837.. కాంగ్రెస్‌ 1175 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్‌లో గెల్లు, కౌశిక్‌ రెడ్డి సొంత గ్రామాల ఓట్ల లెక్కింపు జరిగింది. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 4248.. బీజేపీ 4,086.. కాంగ్రెస్‌ 89 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల 8 రౌండ్లు ముగిసేసరికి 3,270 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

01:06PM
అన్ని రౌండ్లలోనూ ఈటలదే ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి ఈటల ఏడో రౌండ్‌లోనూ ఆధిక్యం సాధించారు. ఏడు రౌండ్ల తర్వాత బీజేపీ 3,432 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఏడో రౌండ్‌లో ఈటల 246 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఏడో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 3,792.. బీజేపీ 4,038.. కాంగ్రెస్‌ 94 ఓట్లు సాధించాయి. ఇప్పటిదాకా వెలువడిన అన్ని రౌండ్లలోనూ ఈటలదే ఆధిక్యం. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 31021.. టీఆర్‌ఎస్‌ 27589.. కాంగ్రెస్‌ 1086 ఓట్లు సాధించాయి.

12:43PM
వీణవంక మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభం
వీణవంక మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ అభ్యర్థి ఈటల ఆరో రౌండ్‌లోనూ ఆధిక్యం సాధించారు. ఈటల ఆధిక్యం రౌండ్‌ రౌండ్‌కు పెరుగుతోంది. ఆరు రౌండ్ల తర్వాత బీజేపీ 3,186 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఆరో రౌండ్‌లో బీజేపీ 4656.. టీఆర్‌ఎస్‌ 3639 ఓట్లు సాధించాయి. ఆరో రౌండ్‌లో బీజేపీ 1017 లీడ్‌ సాధించింది. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 26,983.. టీఆర్‌ఎస్‌ 23,797.. కాంగ్రెస్‌ 992 ఓట్లు సాధించాయి.

11:50AM
ఈటల హవా..
హుజూరాబాద్‌లో ఈటల తన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా వెలువడిన తొలి ఐదు రౌండ్ల ఫలితాలలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఐదు రౌండ్లు ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐదో రౌండ్‌లో బీజేపీ 4,358.. టీఆర్‌ఎస్‌ 4,014.. కాంగ్రెస్‌ 132 ఓట్లు సాధించాయి. మొత్తంగా ఐదు రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ 22,327.. టీఆర్‌ఎస్‌ 20,158.. కాంగ్రెస్‌ 680 ఓట్లు సాధించాయి.

11:23AM
1,825 ఓట్ల ఆధిక్యంలో ఈటల
నాలుగు రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. నాలుగో రౌండ్‌లో ఈటలకు 562 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తంగా 4 రౌండ్ల తర్వాత 1,825 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. నాలుగో రౌండ్‌లో బీజేపీ 4,444.. టీఆర్‌ఎస్‌ 3,882.. కాంగ్రెస్‌ 234 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 17,969.. టీఆర్‌ఎస్‌ 16,144.. కాంగ్రెస్‌ 680 ఓట్లు సాధించాయి.

10:58AM 
మూడు రౌండ్ల తర్వాత పార్టీల వారీగా ఓట్లు
వరుసగా మూడు రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ వెనుకబడింది. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 13,525.. టీఆర్‌ఎస్‌ 12,262.. కాంగ్రెస్‌ 446 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 1263 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

10:48AM 
దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోనూ బీజేపీ ఆధిక్యం
ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోనూ బీజేపీ 129 ఓట్ల ఆధిక్యతను సాధించింది. ఈ గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 182 ఓట్లు వచ్చాయి.

10:35AM 
మూడో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యత
మూడో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యతను కొనసాగించింది. మూడో రౌండ్‌లో 905 ఓట్ల ఆధిక్యం సాధించిన బీజేపీ, మొత్తంగా 1,263 ఓట్ల ఆధిక్యం సాధించింది. మూడో రౌండ్‌లో హుజూరాబాద్‌ మున్సిపాలిటీ ఓట్లను లెక్కించారు. 

10:15AM 
రెండో రౌండ్‌ముగిసే సమయానికి బీజేపీ 9,461.. టీఆర్‌ఎస్‌ 9,103.. కాంగ్రెస్‌ 339 ఓట్లు సాధించాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 358 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:08AM 
రెండో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం
హుజూరాబాద్‌ రెండో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. తన సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంటే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 192 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు రౌండ్ల తర్వాత బీజేపీ మొత్తం 358 ఓట్ల ఆధిక్యంలో ఉంది.  రెండో రౌండ్‌లో బీజేపీ 4,851, టీఆర్‌ఎస్‌ 4,659 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్‌ కేవలం 220 ఓట్లు సాధించింది. 

10:00AM 
కాంగ్రెస్ అభ్యర్ధి కంటే రోటీ మేకర్‌కు ఎక్కువ ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి సాధించిన ఓట్లు(114) కంటే ఎక్కువగా ఇండిపెండెంట్‌ రోటీ మేకర్‌ గుర్తుకు 122 ఓట్లు పోలయ్యాయి. మొదటి ఐదు రౌండ్లలో హుజూరాబాద్‌ మండల ఓట్లను లెక్కిస్తారు.

9:30 AM
తొలిరౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 166 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ 4610, టీఆర్‌ఎస్‌ 4444, కాంగ్రెస్‌ 114 ఓట్లు సాధించాయి.

08:52AM
పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీ 159, కాంగ్రెస్‌ 32, చెల్లనవి 14గా ఉన్నాయి. మొత్తంగా పోస్టల్‌బ్యాలెట్‌లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది.

08:38AM
ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి రౌండ్‌లో హుజూరాబాద్ టౌన్‌ ఓట్లను లెక్కిస్తున్నారు.

08:28AM
హుజూరాబాద్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 

08:20AM
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది.

08:00AM
హుజూరాబాద్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. 8 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ 8.30 వరకూ కొనసాగనుంది. మొత్తం 753 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉన్నాయి. అరగంటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు వెలువడనున్నాయి. తొలుత హుజూరాబాద్‌ మండలానికి చెందిన పోతిరెడ్డిపేట్‌ గ్రామం (పోలింగ్‌ స్టేషన్‌)తో లెక్కింపు మొదలవుతుంది. చివరిగా కమలాపూర్‌ మండలంలోని శంభునిపల్లి (పీఎస్‌ నెం.305)కి చెందిన ఈవీఎంలో ఓట్లు లెక్కిస్తారు. 14 టేబుళ్లపై మొత్తం 22 రౌండ్లుగా ఈ ప్రక్రియ కొనసాగనుంది.

మరిన్ని వార్తలు