తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయట్లేదు: ప్రొ.కోదండరామ్‌

9 Jul, 2021 17:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయట్లేదని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్యలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

మరిన్ని వార్తలు