రేవంత్‌ రెడ్డిని ఉతికి ఆరేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. సిగ్గూశరం ఉంటే నిరూపించు!

3 Aug, 2022 11:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పీసీసీ పదవిని రేవంత్‌ డబ్బులతో కొన్నాడని ఆరోపించారు. తెలంగాణలో పక్కా ప్లాన్‌ ప్రకారం టీడీపీని ఖతం చేశాడని ధ్వజమెత్తారు. పీసీసీ ప్రెసిడెంట్‌ అయి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్లాన్‌ చేసుకున్నాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి  చంద్రబాబుకు ఇచ్చాడని, స్పీకర్‌కు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఉప ఎన్నికకు భయపడి ఉత్తుత్తి రాజీనామా చేశాడని ప్రస్తావించారు.

సోనియాగాంధీని తానెప్పుడూ అవమానపర్చలేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సోనియాను బలిదేవత అన్నది రేవంత్‌ ఒక్కడేనని అన్నారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, తెలంగాణలో ఉద్యమంలో ఏనాడైనా జైలుకెళ్లాడా? అని సూటిగా ప్రశ్నించారు. ఆయన వ్యాపారస్తులను బ్లాక్‌మెయిల్‌ చేస్తాడని ఆరోపించారు.  వ్యాపారం చేయకుండానే ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని రేవంత్‌ను నిలదీశారు.

సిగ్గుశరం ఉంటే బీజేపీతో కాంట్రాక్టు తీసుకున్నట్లు నిరూపించాలని రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. లేదంటే పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు. తాను దేనికైనా సిద్ధమేనని.. రేవంత్‌ బహిరంగ చర్చ సిద్ధమేనా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
చదవండి: టీఆర్‌ఎస్‌కు షాక్‌.. బీజేపీలోకి మంత్రి సోదరుడు!

మరిన్ని వార్తలు