జేసీ దివాకర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం

24 Sep, 2021 16:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం(సెప్టెంబర్‌ 24వ తేదీ) టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. శాసనసభా ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లను కలిశారు. అనంతరం సీఎల్పీలో కార్యాలంయంలో తన పాత మిత్రులు జీవన్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి తదితరులతో సమావేశమయ్యారు.   చదవండి: (దిక్కులేకే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నా: జేసీ)

ఈ సందర్భంగా జేసీ దివాకర్‌ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా జేసీ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. భవిష్యత్తులో మరెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని జేసీకి సూచించారు.

చదవండి: (లాయర్‌ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి)

మరిన్ని వార్తలు