CM KCR: కేంద్రంపై యుద్ధం ఆగదు.. ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు

18 Nov, 2021 19:44 IST|Sakshi

ఇందిరా పార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ మహాదర్నా

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గురువారం మహా దర్నా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద చేపట్టిన ఈ ధర్నలో సీఎం కేసీఆర్‌తో సహా, మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. మహాధర్నా తరువాత గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి సీఎం కేసీఆర్‌ వినతి పత్రం అందించారు
చదవండి: మంత్రి కేటీఆర్‌ చొరవ.. ఐదేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్న కలెక్టర్‌

ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ మహాధర్నా ముగిశాఖ టీఆర్‌ఎస్‌ మంత్రులు బస్సులో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఈ మేరకు ఎంపీ కేశవరావు నేతృత్వంలోని బృందం 10 మంది మంత్రులు,10 ఎంపీలు గవర్నర్నర్‌ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. వీరిలో గంగుల కమలాకర్, మంత్రి సత్యవతి రాథోడ్, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి, నారదాసు లక్ష్మణ్రావు, మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని, శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే జోగు రామన్న, పద్మాదేవేందర్రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాలోత్ కవిత, భాను ప్రసాద్‌ ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ద్వంద వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర విధానం వల్ల రైతులు దెబ్బతింటున్నారని, కేంద్ర వైఖరి రైతులకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ యుద్ధం ఆగదు. ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదని స్పష్టం చేశారు.  పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. 50 రోజులు గడిచిన కేంద్ర నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల గురించి ప్రధానికి లేఖలు కూడా రాశామని..  గ్రామగ్రామల్లో వివిధ రకాల ఆందోళనలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు

‘ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. ఈ యుద్ధం ఢిల్లీ దాకా పోవాలి. కేంద్రం కళ్ళు తెర్పించడానికి ఈ యుద్ధం. మంత్రులే ధర్న కు కూర్చుంటున్నారు అంటున్నారు. 2006లో నాటి గుజరాత్ సీఎం నేటి ప్రధాని మోదీ కూడా ధర్నా చేశారు. రైతుల పక్షాన మేముంటం. పోరాటాలు మాకు కొత్త కాదు’ కాదు అని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు సాయి చంద్ పాటకు మంత్రి కేటీఆర్‌ చప్పట్లు కొడుతూ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు