మోదీ, కేసీఆర్‌లను ఓడిస్తేనే స్వాతంత్య్రం: రేవంత్‌ రెడ్డి

16 Aug, 2021 08:31 IST|Sakshi

స్వార్థ రాజకీయాలకు దేశాన్ని ప్రయోగశాలగా మార్చారు: రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం లో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించినప్పుడే  రైతులు, యువతకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అవుతుందని, ఈ ఇద్దరినీ గద్దెదించేందుకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గాం«దీభవన్‌లో ఆదివారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ, దేశంలోని వెనుకబడిన వర్గాలన్నింటికీ హక్కులు కల్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తే, మోదీ ఫాసిస్టు ప్రభుత్వం మతాల పేరిట ప్రజలను విభజిస్తూ దేశాన్ని ప్రయోగశాలగా మార్చిందని విమర్శించారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి పొన్నాల, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రేవంత్‌ భేటీ అయ్యారు.  
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు