Azadi Ka Amrit Mahotsav: విభజన నెహ్రూ పుణ్యమే బీజేపీ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్‌

15 Aug, 2022 06:32 IST|Sakshi

న్యూఢిల్లీ: విభజన గాయాల స్మారక దినం సందర్భంగా ఆదివారం బీజేపీ విడుదల చేసిన వీడియో వివాదానికి దారి తీసింది. 1947లో దేశ విభజనకు దారి తీసిన ఘట్టాలను అందులో చూపించారు. పాకిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న ముస్లిం లీగ్‌ డిమాండ్‌కు నెహ్రూ తలొగ్గారంటూ ఆరోపించారు. వీడియో అంతా పదే పదే నెహ్రూ విజువల్స్‌ చూపించారు. ఈ వీడియోపై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

ఆధునిక సావర్కర్లు, జిన్నాలు ఇప్పటికీ జాతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ మండిపడ్డారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు విభజన విషాదాన్ని వాడుకుంటూ ప్రధాని మోదీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల థియరీని తెరపైకి తెచ్చింది బీజేపీ ఆరాధించే సావర్కరేనని ఆరోపించారు. దాన్ని జిన్నా అందుకున్నారన్నారు. విభజనకు ఒప్పుకోకుంటే చిన్న చిన్న భాగాలుగా విడిపోయి దేశం సర్వనాశనం అయ్యేదన్నారు. భారతావనని ఏకతాటిపైకి తెచ్చేది ఎప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీయేనని జైరాం అన్నారు.

మరిన్ని వార్తలు