‘తక్షణమే సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయాలి’

8 May, 2021 18:54 IST|Sakshi

కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి

షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్

సాక్షి, హైదరాబాద్‌: అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని వైఎస్‌ షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. కోవాగ్జిన్ టీకా మన హైదరాబాద్‌లోనే తయారవుతున్నా.. రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ వ్యాక్సిన్ ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రెండ్రోజుల వ్యవధిలోనే ఆక్సిజన్ కొరతతో బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో 15 మంది, సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో 11 మంది చనిపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు చేటన్నారు.

ఇంత జరుగుతున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అంతా బాగానే ఉందంటూ.. మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేయడం గర్హనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం మేల్కొని యుద్ధ ప్రాతిపదికన కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పైనే ఉందని, లేనిపక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు.

చదవండి: మహిళా ఉద్యమాలే కేసీఆర్‌కు బుద్ధి చెబుతాయి: వైఎస్‌ షర్మిల

మరిన్ని వార్తలు