వినూత్నం: బాయిలర్‌ కోడి, పెరుగు ప్యాకెట్లు

8 Feb, 2021 09:41 IST|Sakshi

ఇంటింటికీ పంపిణీ చేసిన వార్డు అభ్యర్థి 

పశ్చిమగోదావరి: ఓటర్లను ఆకట్టుకోడానికి పోటీల్లో ఉన్న అభ్యర్థులు వినూత్న పద్ధతులు ఆవలంబిస్తున్నారు. ఉండి మండలంలోని ఒక గ్రామంలో వార్డు పదవికి పోటీలో ఉన్న అభ్యర్థి ఆదివారం తన వార్డు పరిధిలోని ఓటర్లకు ఇంటింటికీ బ్రాయిలర్‌ కోడి, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, గృహావసర వస్తువులు పంపిణీ చేయడం పరిపాటి.

అయితే ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు కొత్త ధోరణిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాంసాహార ప్రియులు ఆదివారం సాధారణంగా చేపలు, మాంసం కొనుగోలు చేస్తుంటారు. దీనిని గ్రహించిన వార్డుకు పోటీ చేస్తున్న అభ్యర్థి ఏకంగా ఒక్కొక్క ఇంటికి బ్రాయిలర్‌ కోడితో పాటు పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేసి పోటీలో ఉన్న ప్రత్యర్థిని కంగు తినిపించారు. అదే మండలంలోని మరొక గ్రామంలో వార్డు పదవికి పోటీలో ఉన్న వ్యక్తి ఇంటి అవసరాలకు ఉపయోగపడే కిరాణా సరుకులను పంపిణీ చేశారు.
(చదవండి: మోగని ‘గంట’: ఉత్తుత్తి లేఖతో హడావుడి..)
(చదవండి: బాబ్బాబూ.. పోటీలో ఉండండి చాలు..)

మరిన్ని వార్తలు