బల్దియా పీఠానికి దారేది?

5 Dec, 2020 05:31 IST|Sakshi

హంగ్‌ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తికర చర్చ 

ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపితే మేజిక్‌ ఫిగర్‌ 98 

టీఆర్‌ఎస్‌కు 86 మంది సభ్యుల బలం 

కారు ముందు మూడు మార్గాలు 

ఎంఐఎం అధికారిక మద్దతు లేదా గైర్హాజరు 

మజ్లిస్‌ బరిలో నిలిచినా గులాబీదే బల్దియా 

ఎలా ముందుకెళ్లాలనే అంశంపై టీఆర్‌ఎస్‌లో చర్చ 

నేడు పార్టీ వ్యూహం ఖరారయ్యే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో హంగ్‌ రావడంతో మేయర్‌ పీఠం ఎవరికి, ఎలా దక్కుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బల్దియాలో అతిపెద్ద పారీ్టగా అవతరించిన టీఆర్‌ఎస్‌కు పీఠం దక్కించుకోవడానికి ఉన్న మార్గాలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మేయర్‌ ఎన్నికకు మరో రెండు నెలల సమయం ఉందన్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ కుర్చీని దక్కించుకునేందుకు మూడు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎంఐఎంతో అధికారిక పొత్తు మొదటిది కాగా, మేయర్‌ ఎన్నిక రోజున ఎంఐఎం గైర్హాజరు కావడం రెండో మార్గంగా కనిపిస్తోంది. ఇక, ఎంఐఎం కూడా మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీ ఎలాగూ పోటీలో ఉంటుంది కనుక ఎక్స్‌అఫీషియో సభ్యుల సాయంతో ఎక్కువ ఓట్లు తెచ్చుకుని టీఆర్‌ఎస్‌ బల్దియా పీఠంపై కూర్చుంటుందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి టీఆర్‌ఎస్‌కు మేయర్‌ పీఠం దక్కాలంటే మాత్రం ఎంఐఎం కీలకం కానుంది.

ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఎలా ముందుకువెళ్లాలనే దానిపై టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లు దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రేటర్‌ పీఠం దక్కుతుందన్న నమ్మకం ఉండటంతోనే భారతీనగర్‌ కార్పొరేటర్‌ సింధు ఆదర్శ్‌రెడ్డికి ప్రగతిభవన్‌ నుంచి పిలుపు వచి్చందని తెలుస్తోంది. గ్రేటర్‌ పీఠం దక్కడం ఖాయమే అని, ఏ వ్యూహంతో దాన్ని దక్కించుకోవాలన్న దానిపై శనివారం మరింత స్పష్టత వస్తుందని తెలంగాణ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి.  

మొత్తం లెక్క ఇదీ..
గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లకు గాను నేరేడ్‌మెట్‌ మినహా మిగతా 149 డివిజన్ల ఫలితాలను ప్రకటించగా, టీఆర్‌ఎస్‌ 55 డివిజన్లలో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. జీహెచ్‌ఎంసీలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిపి మొత్తం 45 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉండగా, ఇందులో టీఆర్‌ఎస్‌కు 31 మంది బలం ఉంది. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో పాల్గొనే మొత్తం ఓటర్ల సంఖ్య 195. ఈ నేపథ్యంలో మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఏ పార్టీకి అయినా 98 మంది (మేజిక్‌ ఫిగర్‌) మద్దతు అవసరం ఉంటుంది. ఎక్స్‌అఫీíÙయో సభ్యులను కలిపితే టీఆర్‌ఎస్‌కు 86, బీజేపీకి 51, ఎంఐఎంకు 54, కాంగ్రెస్‌కు ముగ్గురు సభ్యుల బలం ఉంది. దీంతో అటు కమలనాథులకు, ఇటు కాంగ్రెస్‌కు మేయర్‌ పీఠం గెలుపొందే అవకాశం లేనే లేదు.  

మరిన్ని వార్తలు