బీజేపీలో వర్గపోరు కలకలం

28 Feb, 2021 16:11 IST|Sakshi

సాక్షి, విజయనగరం: జిల్లా బీజేపీలో వర్గపోరు కలకలం రేపింది.  పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. అసలు విషయంలోకి వెళితే.. గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర కోశాధికారిగా ఉంటూ పాకలపాటి సన్యాసిరాజు పార్టీ ఫండ్‌ పేరిట అవినీతి పాల్పడ్డారంటూ పావని రెడ్డి వర్గం ఫిర్యాదు చేసింది. తనపై ఫిర్యాదు చేశారన్న కారణంతో సన్యాసిరాజు పదవికి రాజీనామ చేశాడు. దీంతో అప్పటినుంచి పావని రెడ్డి, సన్యాసి రాజు మధ్య వర్గపోరు మొదలైంది. జిల్లాలో వీరిద్దరి వర్గ పోరుతో బీజేపీ ద్వితీయ శ్రేణి కేడర్‌ నిరుత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్‌ నరసింహారావు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. 


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు