ఈటలపై జీవన్‌ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌

14 Jun, 2021 18:08 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజకీయ నిర్ణయంపై కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటలను మంత్రి వర్గం నుంచి తొలగించిన విధానంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లోని అంతర్గత కుమ్ములాటకు సంబంధించి తెలంగాణ ప్రజల్ని ఆలోచింపజేస్తుందని వ్యాఖ్యానించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈటలపై వచ్చిన ఆరోపణలపై ఏవిధంగా ప్రభుత్వం స్పందించిందో అదేవిధంగా ఇతర మంత్రులపై వచ్చిన ఆరోపణలపై స్పందించాలన్నారు.

మంత్రి మల్లారెడ్డి, పువ్వాడా అజయ్, కేటిఆర్ పై అనేక ఆరోపణలు ఉన్నాయని, మరి వారిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ఈటల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తెలంగాణ ప్రజలంతా అండగా నిలిచేవారని, ప్రస్తుతం బీజేపీలో చేరడంతో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. బీజేపీ తోక పార్టీయే టీఆర్ఎస్ అని ఆ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీలో చేరిన ఈటల ప్రగతి శీల భావాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని తెలిపారు. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఉద్యోగస్తులను వివక్షతకు గురి చేయడమేనానని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి, 2018 మే నుంచి ఉద్యోగులకు రావలసిన పిఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చదవండి: చంద్రబాబు ఫాదర్‌ ఆఫ్‌ కరప్షన్‌: గుడివాడ అమర్‌నాథ్‌

మరిన్ని వార్తలు