జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి టైగర్ జగర్నాథ్‌ కన్నుమూత.. సీఎం తీవ్ర విచారం..

6 Apr, 2023 15:26 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో దా కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

'తీరని నష్టం జరిగింది. మన టైగర్ జగర్నాథ్ దా ఇక లేరు. జార్ఖండ్ గొప్ప ఉద్యమకారుడు,  నిరంతరం శ్రమించే వ్యక్తి, విశేష ప్రజాధరణ గల నాయకుడ్ని మనం కోల్పోయాం. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఈ విపత్కర పరిస్థితిలో కుటుంబసభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని ప్రార్థిస్తున్నా.' అని సీఎం ట్వీట్ చేశారు.

అయితే జగర్నాథ్‌కు ఇటీవలే చెన్నై ఆస్పత్రిలో ఊపరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. 2020లో కరోనా బారిన పడిన అనంతరం కూడా ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. గతనెల అనారోగ్యం బారినపడటంతో రాంచీ నుంచి హెలికాప్టర్‌ ద్వారా చెన్నై ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయారు.
చదవండి: దిగ్భ్రాంతికి లోనయ్యా... చాలా బాధగా ఉంది: ప్రకాష్‌ రాజ్‌

మరిన్ని వార్తలు