సభ్యత మరిచి బాబు వ్యాఖ్యలు

9 Mar, 2021 04:31 IST|Sakshi

ఆయన, లోకేశ్‌ పిచ్చికుక్కల్లా వ్యవహరిస్తున్నారు 

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమితో ఇద్దరూ దేశం వీడాల్సిందే

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ 

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ అస భ్యంగా మాట్లాడుతూ ప్ర జలను రెచ్చగొడుతున్నా రని వైఎస్సార్‌సీపీ ఎమ్మె ల్యే జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. ఇంగితజ్ఞానం లేకుండా పిచ్చికుక్కల్లా వ్యవహరిస్తూ ప్రజలపైనా, సీఎం జగన్‌పైనా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వారిద్దరూ సభ్యతగా నడుచుకోవాలని హితవు పలికారు. స్థానిక ఎన్నికల్లో ఎదురవుతున్న ఓటమిని తట్టుకోలేక చంద్రబాబు, లోకేశ్‌ మతిస్థిమితం కోల్పోయారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రానికి తండ్రీకొడుకు విషపురుగుల్లా తయారయ్యారని నిప్పులు చెరిగారు.

కరోనా ఫస్ట్‌ వేవ్‌లో ఇద్దరూ ఏపీ వదిలి పారిపోయారని గుర్తు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో దేశం వదిలిపోయే పరిస్థితి వారికి వస్తుందని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికలు, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో తగిన శాస్తి జరిగినా వారి బుద్ధి మారలేద ని ధ్వజమెత్తారు. సీఎంను ఉద్దేశించి ఏం పీకుతావ్‌ అని అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎంత దిగజారిపో యారో వారి మాటలను బట్టే అర్థమవుతోందన్నారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం పీకలేకపోయారని, అందుకే గత ఎన్నికల్లో ప్రజలు వారిని కలుపుమొక్కల్లా పీకేశారని ఎద్దేవా చేశారు. మునిసిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వందశాతం విజయదుందుభి మోగిస్తుందన్నారు. విజయవాడలో ఇప్పటికే టీడీపీ నిట్టనిలువుగా చీలిపోయిందని ఆయన చెప్పారు.  

మరిన్ని వార్తలు