టాలిగంజ్‌లో నడ్డా ర్యాలీ

6 Apr, 2021 04:49 IST|Sakshi
సోమవారం కోల్‌కతాలో రోడ్‌ షో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా

కోల్‌కతా: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమబెంగాల్‌లోని టాలిగంజ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ట్రామ్‌ డిపో వద్ద ప్రారంభమైన ర్యాలీ దాదాపు నాలుగు కిలోమీటర్లు సాది గోరియా మోర్‌ వద్ద ముగిసింది. జేపీ నడ్డా, కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో, నటి పాయల్‌ సర్కార్‌లు బీజేపీ జెండాలతో అలంకరించిన లారీపై అభివాదాలు చేస్తూ ముందుకు వెళ్తుండగా, వందలాది మంది కార్యకర్తలు జైశ్రీరామ్, మోదీ జిందాబాద్, నడ్డా జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తూ సాగారు. మరోవైపు నడ్డా హుగ్లీ జిల్లాలోని శ్రీరాంపూర్, చుంచురా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉండగా, ఆ కార్యక్రమాలు హఠాత్తుగా రద్దయ్యాయి. ఢిల్లీలో అత్యవసర భేటీ కారణంగా ఆయన వెళ్లిపోవాల్సి వచ్చిందని బీజేపీ చెప్పింది. అయితే నడ్డా ప్రచార కార్యక్రమాలకు జనాలు పలచగా ఉండటంతో ఆయన రద్దు చేసుకొని వెళ్లిపోయారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది.   
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు