Jupalli Krishnarao: ఇంటికే వస్తా అంటే రమ్మంటిని.. రాత్రి నుంచి చూస్తున్నా ఎక్కడా?

26 Jun, 2022 15:27 IST|Sakshi

సాక్షి,నాగర్ కర్నూల్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం విష్ణువర్ధన్‌ రెడ్డి పరస్పర సవాళ్లతో కొల్లాపూర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించారు. అయితే, చర్చలో పాల్గొనేందుకు జూపల్లి ఇంటికి బీరం ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే బీరం నిరాధార ఆరోపణలను జూపల్లి మీడియా ఎదుట ఎండగట్టారు.
చదవండి👉🏼
విరాట పర్వం.. 30 ఏళ్ల కిందట పేలిన తూటా శంకరన్న చేతిలో సరళ బలి

రాత్రి నుంచి చూస్తున్నా.. ఎ​క్కడా?
‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామన్న. కాని చర్చకు ఇంటికే వస్తా అంటే స్వాగతం పలుకుతానని చెప్పా. నీ మాట ప్రకారమే రాత్రి నుంచి ఎదురుచూస్తున్నా. కానీ, ఎమ్మెల్యే రాలేదు. మూడున్నరేళ్లు ఎమ్మెల్యే ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అరెస్టు చేయించుకుని తప్పించుకుని పోయినవ్.. ముఖం చాటేసుకున్నవ్.

ఎమ్మెల్యే మాట మార్చాడు. నేను మాట మార్చలేదు. హుస్సేన్ సాగర్ కారు ప్రమాదం, ఫ్రుడెన్షియల్ బ్యాంకు వ్యవహారాలపై ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నాడు. అప్పు తీసుకుని వ్యాపారం చేసాం, ఇది తప్పు అన్నట్లుగా మాట్లాడితే ఎట్లా!. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని సహచర మంత్రులే సూచించినా  నేను వెనక్కి తగ్గలేదు. మిగతా మంత్రులపై ఒత్తిడి వస్తుంది వద్దన్నారు.

వెయ్యి కోట్లిచ్చినా అమ్ముడు పోయే వ్యక్తిని కాను. నాది మచ్చలేని చరిత్ర. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కోర్టులో కేసు వేసిందెవరు? నా పై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే  బీరంపై పరువు నష్టం దావా వేస్తా’అని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
చదవండి👉🏼కొల్లాపూర్‌లో హై టెన్షన్‌.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌

మరిన్ని వార్తలు