‘అది మీ తండ్రులు, తాతల వల్ల కూడా కాదు’

30 Sep, 2020 17:58 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ప్రజా సమస్యలపైన అవిశ్రాంతంగా పోరాడటంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలతోపాటు మిగిలిన వర్గాలు అందరూ ముఖ్యమంత్రితోనే ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి మంత్రివర్గంలో సింహభాగం దళితులు, మైనార్టీలే ఉన్నారని, దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు అసత్యాన్ని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట కొన్ని ఘటనలు జరుగుతున్నాయని తెలిపిన జూపూడి వాటిపై ప్రభుత్వం స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. చదవండి : (పవన్‌తో పొత్తు పెట్టుకొని పెద్ద తప్పు చేశాం)

చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనను చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అంటగట్టడానికి ప్రయత్నించారని జూపూడి ప్రభాకర్‌ రావు అన్నారు. సీఎం దళిత వ్యతిరేకి చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. డీజీపీ లాంటి వ్యక్తులపై కూడా తెలుగుదేశం పార్టీ బురద జల్లే కార్యక్రమం పెట్టుకుందని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పింది కరెక్టే అని డీజీపీ చెప్పాలా....! అని, అనేక విషయాల్లో డీజీపీని అవమాన పరిచేలా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దళితులపై దాడి చేస్తే అది సీఎం జగన్‌ చేయించాడని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు ఒక విధంగా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పేది మరొక విధంగా ఉందన్నారు. చదవండి : మేము గుర్తుకు రాలేదా.. బాబు? 

‘చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎప్పుడు పోటీ పడలేరు. ఆయన దెబ్బకు తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లాలో తోక ముడిచింది. మాజీ న్యాయమూర్తి రామకృష్ణ గత అయిదు సంవత్సరాల్లో నీ చుట్టూ తిరిగితే ఎందుకు అతని సమస్య పరిష్కరించలేదు. చంద్రబాబు ఇప్పుడు ఆయనను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. దళితులంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారు. కాబట్టి చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నాడు. మీ ప్రభుత్వంలో దళితులపై దాడి జరిగినప్పుడు హోంమంత్రి, డీజీపీ ఎప్పుడైనా వెళ్లారా ? హోంమంత్రి, డీజీపీ దళితుడు కాబట్టి మీకు చులకనగా కనిపిస్తున్నారా. దళితులంతా ఈ ప్రభుత్వం మాది అని భావిస్తున్నారు. మహిళలంతా ఈ ప్రభుత్వం మాది అని భావిస్తున్నారు. చదవండి : చంద్రబాబుదో అబద్ధాల ఫ్యాక్టరీ

దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో గాని ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో గాని మీరు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. అందుకే ఇప్పుడు తండ్రి కొడుకులు దళిత జపం చేస్తున్నారు. దళితులు అడ్డంపెట్టుకుని చంద్రబాబు చేసే చీటింగ్ వ్యవహారాలు ఇప్పటికైనా మానుకోవాలి. దళితులు ముందుకు నడిపించే విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఈ దేశానికి ఆదర్శం ఆయన దళితులకు వ్యతిరేకమని చిత్రీకరించాలి అనుకుంటే అది మీ తండ్రులు, తాతలు వల్ల కూడా కాదు. అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు