పవన్ కల్యాణ్‌పై కేఏ పాల్‌ సెటైర్లు.. కనీన జ్ఞానం ఉందా అంటూ..

16 Jan, 2023 15:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్‌కు బుర్ర ఉందా? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికి ప్రజలే కారణమంటూ పవన్‌ మాట్లాడటం అనేది తెలివి తక్కువతనం అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. 

కాగా, కేఏ పాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ నీకు ఓట్లు వేయకపోతే ప్రజలును తిట్టేస్తావా?. ఎన్నికల్లో ఓడిస్తున్నారనే కారణంతో టీడీపీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పడం ఎంత వరకు కరెక్ట్‌. ముఖ్యమంత్రిని చెయ్యాలనే కండిషన్‌తో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటానని చెప్పడం పెద్ద తప్పు. నీకు పదవులు ఇస్తామని హామీ ఇస్తే ఎవరి పార్టీలోకి అయినా వెళ్లిపోతావా?. కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవి ఇస్తామని ఏ పార్టీ అయినా చెబితే వారికే సపోర్ట్‌ చేస్తావా?. 

చంద్రబాబు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తానంటే ఎలా నమ్మావు. తన కొడుకు లోకేష్‌ను కాదని నిన్ను ముఖ్యమంత్రిని ఎలా చేస్తాడు. కనీస జ్ఞానం ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు తెలివి తేటలను ఇచ్చాడని, దాని వాడాలని కేఏ పాల్.. పవన్‌ సూచించారు. ప్రజలను మోసం చేయడానికే పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు.  ప్రజలు తెలివైనా వారు నిన్ను అసలు గెలిపించరు అంటూ విమర్శలు చేశారు. 

సందుల్లో మీటింగ్స్‌ పెట్టకండి.. బహిరంగ సభలు బహిరంగంగానే మీటింగ్‌లు పెట్టండి అని అన్నాను. అందులో తప్పేముంది. జనం ఎక్కువ సంఖ్యలో వచ్చారని చూపించడానికే చంద్రబాబు ఇలా చేస్తున్నాడు. చంద్రబాబు చేసింది తప్పు. చంద్రబాబు సభల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి కంగ్రాట్స్‌ చెబుతున్నాను. వాళ్లు చేసింది కరెక్ట్‌ అంటూ ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు