నాలాంటి గురువుకు చంద్రబాబు ద్రోహం చేశాడు: కేఏ పాల్‌

20 Sep, 2023 21:06 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. తెలంగాణలో వివక్ష పాలన నడుస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. బుధవారం నిజామాబాద్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన దేశ, తెలంగాణ రాజకీయాలపై మాట్లాడారు.ఈ క్రమంలో ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడుపైనా ఆయన నిప్పులు చెరిగారు. 

చంద్రబాబు నాయుడు ఒక అవినీతి చక్రవర్తి. చంద్రబాబు కచ్చితంగా అవినీతికి పాల్పడ్డారు. ఆయన అరెస్ట్‌ సరైనదే. చంద్రబాబు, ఎన్టీఆర్‌కే కాదు నాలాంటి గురువుకు ద్రోహం చేశారు అని పాల్‌ వ్యాఖ్యానించారు. 

తెలంగాణ రాజకీయ పార్టీలపై ఫైర్‌
బీజేపీ, బీఅర్‌ఎస్‌ ఒక్కటే. కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ కాకపోవడమే అందుకు నిదర్శనం. మునుగోడులో బీఆర్‌ఎస్‌ వందల కోట్లు పెట్టి గెలిచింది. నాపై పోటీకి అందరూ భయపడుతున్నారు. 

తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోంది.  తెలంగాణలో రూ. 6 లక్షల కోట్ల అప్పు అయ్యింది. కేసీఆర్ సర్కారు ది జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని మండిపడ్డారాయన. ఇక.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించే క్రమంలో.. ‘‘దేశంలో కాంగ్రెస్ ఎక్కడుంది. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, గల్లిలో లేదు. కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. దేశాన్ని సర్వనాశనం చేసింది.. అవినీతికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మహిళ రిజర్వేషన్ బిల్లు కేవలం ఎన్నికల స్టంట్’’ అని కేఏ పాల్‌ తేల్చేశారు.

మరిన్ని వార్తలు